Begin typing your search above and press return to search.
రాంమాధవ్ ఎవరు? అనేశాడే
By: Tupaki Desk | 13 Jun 2019 10:18 AM GMTతెలంగాణలో బీజేపీ ఆపరేషన్ మొదలైపోయింది. ఇప్పటికే ఆ పార్టీ వ్యూహకర్తలు ఆ పనిలో పడ్డారు. 2024లో తెలంగాణ మా టార్గెట్లో ఉందని పార్టీ కీలక నేత, వ్యూహకర్త రాంమాధవ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో పలువురు కాంగ్రెస్ ఎంపీలు బీజేపీలో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఉన్నదే ముగ్గురు ఎంపీలు... వారిలో ఒకరు పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి... ఈ నేపథ్యంలో మిగిలిన ఇద్దరు ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి బీజేపీలో చేరుతున్నట్టు వార్తలు వచ్చాయి. బిజెపి ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ను కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీని కలిసిన వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కెసిఆర్ అన్న కూతురు రమ్యా రావు, మాజీ ఎంపీ వివేక్ కూడా ఉన్నారని అంటున్నారు. పైగా నిన్న రేవంత్ రెడ్డి, వివేక్ కలిసిన విషయం రేవంత్ తన సోషల్ మీడియా అక్కౌంట్లో షేర్ చేసుకున్నారు. దీంతో ఈ వార్తకు మరింత బలం వచ్చింది.
అయితే, ఈ వార్తలను కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా ఖండించారు. తనపై కొందరు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీలో చేరుతున్నామని, ఆ పార్టీ నేత రాంమాధవ్ ని కలుస్తున్నాయని వార్తలు రావడం చూశాను. అవన్నీ అసత్యాలు. అసలు నాకు రాంమాధవ్ ఎవరో తెలియదు అని ఆయన వ్యాఖ్యానించారు. నేను కాంగ్రెస్ ను వీడనని, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యంగా ముందుకు వెళ్తానని అన్నారు. నిన్న మొత్తం నియోజకవర్గంలోనే ప్రజల మధ్యనే ఉంటే హైదరాబాదులో ఎవరినో కలిసినట్లు చెబుతున్నారు. ఆయనెవరో కూడా నాకు తెలియదు అన్నారు. తాను నల్గొండలో ఉండగానే... ప్రజల మధ్యలో ఉన్నపుడే ఇలాంటి వార్తలు సృష్టించారంటే... ఒక వేళ ఢిల్లీలో ఉండి ఉంటే... ఈ పాటికి పార్టీ మారిపోయాయనని రాసేవారేమో అని అన్నారు. ఇలాంటి తప్పుడు వార్తలు వేస్తే పరువు నష్టం దావా వేస్తానని మీడియాకు ఆయన సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇది కేవలం దుష‍్ప్రచారం అని కోమటిరెడ్డి మండిపడ్డారు.
ఈ వార్తలు రావడానికి అనేక కారణాలున్నాయి. కేసీఆర్ ను వ్యతిరేకించే ప్రజలు గాని, నేతలు గాని ... కాంగ్రెస్ మీద హోప్ కోల్పోయారు. దీంతో కేసీఆర్ ను దెబ్బ కొట్టాలంటే... పదవి నుంచి దించాలంటే బీజేపీకి మద్దతు పలకడం మేలన్న భావన తెలంగాణలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఈ అవకాశాన్ని వాడుకోవడానికి బీజేపీ కాచుకుని కూర్చుంది. ఇప్పటికే నాలుగు ఎంపీలు అనూహ్యంగా గెలిచిన బీజేపీ 2024 నాటికి అధికారంలోకి రావాలని గట్టిగా నిర్ణయించుకుంది. కేంద్రంలో అధికారంలో ఉండటంతో బీజేపీకి ఇది సాధ్యమని అందరూ నమ్ముతున్నారు.