Begin typing your search above and press return to search.
అస్సాం విజయం వెనుక తెలుగోడు
By: Tupaki Desk | 20 May 2016 6:13 AM GMTఢిల్లీ - బిహార్ రాష్ట్రాల్లో ఓటమితో డీలాపడిన కమలం ఇప్పుడు ఈశాన్య దేశంలో పాదం మోపి ఫుల్ కాన్ఫిడెన్సులోకి వచ్చేసింది. దక్షిణ భారతంలోని కర్ణాటకలో పాగా వేయడానికి తీసుకున్న సమయం కంటే ఈశాన్య రాష్ట్రంలోని అసోంలో అధికారం చేజిక్కించుకునేందుకు తీసుకున్న సమయం తక్కువ. కర్ణాటకలో అధికారంలోకి రావడానికి ఆ పార్టీకి 15 సంవత్సరాలు పడితే అస్సాంలో అంతకంటే తక్కువ సమయంలోనే అధికారంలోకి వచ్చేసింది. ప్రధానంగా అసోంలో బిజెపి విజయం ప్రత్యర్ధి పార్టీలను నివ్వెరపరిచింది. నిజానికి అంతకుముందు ఆ రాష్ట్రంలో ఐదు సీట్లు మాత్రమే ఉన్న బిజెపి, ఈసారి 83 సీట్లతో అధికారం చేజిక్కించుకోవడంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన బీజేపీ నేత వ్యూహాలు ఉన్నాయి. అవును... ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి - ప్రధాని మోదీ వ్యూహబృందంలోని కీలక సభ్యుడయిన తెలుగునేత రాంమాధవ్ అస్సాంలో బీజేపీ విజయవానికి వ్యూహ రచన చేశారు.
ఎన్నికలకు ఏడాది ముందే ఆయన అస్సాం మీద దృష్టి సారించి, క్షేత్రస్థాయి వాస్తవాలను అధ్యయనం చేశారు. వివిధ గిరిజన తెగలు - ఉప కులాల సమీకరణ సాధించడంలో విజయం సాధించారు. దానికోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకుని, నియోజకవర్గాల వారీగా పరిస్థితులను సమీక్షించి, అందుకు అనుగుణంగా చేసిన వ్యూహరచన - ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయనకు ఇది నాలుగవ విజయం. జమ్ము-కశ్మీర్ - మహారాష్ట్ర - అరుణాచల్ ప్రదేశ్ లో సక్సెస్ కు కూడా రాంమాధవే చక్రం తిప్పారు. తాజాగా అస్సాంను భాజపా ఖాతాలో వేశారు.
కాగా ఛాన్సెస్ తక్కువగా ఉణ్న అస్సాంలో బీజేపీకి అధికారం అందివ్వడమన్నది చిన్న విషయం కాదు. ఇది వ్యక్తిగతంగా రాంమాధవ్ ప్రతిష్ఠపెంచే ఫలితమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు ముందు, తర్వాత ఆయా దేశాలకు వెళ్లి దేశ ప్రతిష్ఠతోపాటు, మోదీ ఇమేజ్ ను పెంచేందుకు కృషి చేస్తున్న రాంమాధవ్ - ఈ ఎన్నికల విషయంలో కూడా ప్రధాని తనపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చారు. ఐదు సీట్లు మాత్రమే ఉన్న అసోంలో ఏకంగా అధికారమే చేపట్టడంతో పార్టీలో రాంమాధవ్ ఇమేజ్ బాగా పెరిగింది. ఎన్నికలంటే అమిత్ షా .. అమిత్ షా అంటే ఎన్నికలు అన్నట్లుగా ఉన్న పరిస్థితి అమిత్ షా ముఖ్య అనుచరుడు ప్రశాంత్ కిశోర్ వెళ్లిపోవడంతో మారిపోయింది. అలాంటి సమయంలో రాంమాధవ్ కూడా గెలుపు వ్యూహాలు రచించడంలో సిద్ధహస్తుడు కావడం ఎంతయినా పార్టీకి లాభించే అంశమే.