Begin typing your search above and press return to search.
ఆపరేషన్ 'అనంత'.. అంతా బీజేపీలోకి..!?
By: Tupaki Desk | 7 Jun 2019 9:34 AM GMTఏపీలో బంపర్ మెజార్టీతో వైసీపీ అధినేత జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. క్లీన్ పాలిటిక్స్ తో అవినీతి రహిత పాలన అందిస్తానంటూ ప్రతిన బూనారు. ఆ మేరకు చకచకా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. జగన్ స్టామినాకు ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలు 151 సీట్లు కట్టబెట్టి అఖండమెజార్టీని కట్టబెట్టారు. వైసీపీ ప్రభుత్వ తీరు చూస్తుంటే వచ్చే ఐదేళ్లే కాదు.. సుధీర్ఘకాలం వైసీపీ అధికారంలో ఉండడం ఖాయమనే అంచనాలు నెలకొన్నాయి.
ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్న రాయలసీమ టీడీపీ నేతలు రాయలసీమలో ఇప్పుడు జగన్ నుంచి తమను తాము రక్షించుకోవడం తోపాటు సురక్షితంగా ఉండడానికి ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్లు టీడీపీని వీడి బీజేపీలో చేరితే మంచిదని భావిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండడం.. పైగా మోడీకి - జగన్ సన్నిహితంగా ఉండడంతో బీజేపీలో చేరి రాజకీయ ఆశ్రయం పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక రాయలసీమ టీడీపీ సీనియర్ నేతల ఆకాంక్షను పసిగట్టిన బీజేపీ అధిష్టానం తాజాగా బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ను రంగంలోకి దించి సదురు నేతలతో చర్చలు జరిపినట్టు తెలిసింది. ముఖ్యంగా జేసీ బ్రదర్స్ - పరిటాల కుటుంబం - పల్లె రఘునాథరెడ్డి - వరదాపురం సూరి ఫ్యామిలీలు బీజేపీ అధిష్టానంతో సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. వీరు త్వరలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిసి బీజేపీలో చేరబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
ఈనెల 23 లేదా 27న మొదట టీడీపీ ప్రభుత్వంలో చీఫ్ విప్ గా చేసిన పల్లె రఘునాథరెడ్డి - మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరిలు బీజేపీలో చేరబోతున్నారని తెలిసింది. తర్వాత జేడీ బ్రదర్స్ తమ కుమారులతో కలిసి చేరిక ఉంటుందని సమాచారం. ఇక అనంతపురం ఫ్యాక్షన్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన పరిటాల కుటుంబం కూడా టీడీపీని వీడేందుకు సిద్ధమైందన్న వార్త హల్ చల్ చేస్తోంది. సుధీర్ఘకాలంలో టీడీపీలో ఉన్న వీరు పార్టీ మారితే ప్రజామోదం ఉంటుందా అనే దానిపై ఆలోచిస్తున్నట్టు తెలిసింది. అందుకే వేచిచూస్తున్నారని సమాచారం. ఇలా టీడీపీ కుదేలైన వేళ ఆ పార్టీని వీడి బీజేపీ బాటపట్టేందుకు టీడీపీ అనంతపురం నేతలు క్యూ కడుతున్నారట.. ఇలాగే కొనసాగితే టీడీపీ మరింత బలహీనపడడం ఖాయంగా కనిపిస్తోంది.