Begin typing your search above and press return to search.
బీజేపీకి డిపాజిట్లు కూడా రావని తేల్చేశాడుగా?
By: Tupaki Desk | 31 Oct 2019 2:53 PM GMTఅధికారం చేతిలో ఉన్నప్పుడు మాటల్లో ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్లు కనిపించటం మామూలే. వాస్తవాల్ని దగ్గరకు రానివ్వకుండా ఉండే వాతావరణం ఎప్పుడూ ఉంటుంది. పవర్ తో వచ్చే మిథ్యలో కొట్టుమిట్టాడుతూ తప్పుల మీద తప్పులు చేస్తుంటారు. పవర్ చేజారిన తర్వాత అయ్యో.. అయ్యయ్యో అంటూ పెడబొబ్బలు పెడుతుంటారు. సార్వత్రిక ఎన్నికల ముందు చంద్రబాబు వద్దకు వెళ్లి.. సార్ మన పరిస్థితి ఏం బాగోలేదు.. మన ప్లాన్ మార్చాలని చెబితే వినేవారా? అప్పుడు దాకా ఎందుకు? కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న కారణంగా అటు తెలంగాణలోనూ.. ఇటు ఏపీలోనూ దెబ్బ పడిందన్న వాస్తవాన్ని నమ్మటానికి ఇప్పటికి బాబు సిద్దంగా లేరని తమ్ముళ్లు వాపోతూ చెబుతుంటారు.
ఇప్పుడు బాబు ఉన్న మైండ్ సెట్ లోనే కమలనాథులు ఉంటున్నారు. వాపును చూసి బలుపుగా ఫీలైన నేతలు.. తమ పార్టీలోకి వస్తున్న టీడీపీ నేతలతో రాజ్యమేలతారని భావిస్తున్నారు. అయితే.. రాంమాధవ్ లాంటి వారు అర్థం చేసుకోని అంశం ఏమంటే.. ఇప్పుడు బీజేపీలోకి వస్తున్న వారంతా మోడీ రక్షణ కవచం తప్పించి.. బీజేపీలో కొనసాగి.. వారి జీవితాల్ని తరింపు చేసుకోవాలన్న ఉద్దేశం లేదన్నది మర్చిపోకూడదు.
బాబుకు కుడి ఏడమ భుజాలుగా ఉండే సుజనా.. సీఎం రమేశ్ లాంటోళ్లే.. బైబై బాబు అని చెప్పేసి మోడీషాల పంచన చేరిన ముదురుకేసులు ఏపీ నేతలు. అలాంటివారిని నమ్ముకొని రానున్న రోజుల్లో ఏపీలో కాబోయే ప్రధాన ప్రతిపక్షమన్న పగటి కలలు కంటున్న రాంమాధవ్ ను చూస్తే జాలి వేయకమానదు. ప్రధాన ప్రతిపక్షం దాకా ఎందుకు.. సరిగ్గా ఒక్కటంటే ఒక్క స్థానంలో బీజేపీ గెలిస్తే అదే గొప్పంటున్నారు.
తప్పదు కాబట్టి మోడీముందు సాగిల పడుతున్నారు కానీ.. ఏపీకి ఏ మాత్రం సహాయ సహకారాలు అందించని మోడీ మీద ఏపీ ప్రజల్లో గొంతుల వరకూ కోపం ఉంది. సమయం వచ్చినప్పుడు చెప్పాల్సిన రీతిలో సమాధానం చెప్పాలని డిసైడ్ అయిన వేళ.. ఆ వాస్తవాల్ని గుర్తించకుండా ఏపీ రాజకీయాల్లో తామే కీలకం అవుతామని.. తమకు టీడీపీ.. జనసేన అవసరం అస్సలు లేదని చెబుతున్న రాంమాధవ్ మాటల్ని చూస్తే.. ఆయనిప్పుడు నేల మీద నడుస్తున్నట్లుగా లేరని చెప్పక తప్పదు. వాస్తవాల్ని మరిచి విర్రవీగే వారికి ఎలాంటి పాఠం చెప్పాలో ఏపీ నేతలకు బాగానే అవగాహన ఉందన్న విషయం చరిత్రను తిరగేస్తే ఇట్టే అర్థమవుతుంది. ఆ విషయం రాం మాధవ్ ఎప్పటికి తెలుసుకుంటారో?