Begin typing your search above and press return to search.
మోడీకి ఈ తెలుగు నేత అంటేనే గౌరవమట
By: Tupaki Desk | 14 March 2017 4:53 AM GMTకొందరికి నిత్యం తెరమీద కనిపించాలనే ఆసక్తి ఉంటుంది. తమ మాటలు, చేతలతో ఎదుటివారిని ఆకట్టుకోవడం వారి నైజం. ఇంకొందరికి గుర్తింపుతో పనేమీ లేదు. ఒక లక్ష్యం పెట్టుకొని దాన్ని సాధించడం ద్వారా తమ ప్రత్యేకతను చాటుకోవడం వారి విధానం. వ్యక్తిగతంగా అయినా రాజకీయాల్లో అయినా ఇదే జరుగుతుంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఇపుడు బీజేపీ జాతీయ నాయకుల్లో ఉంది. తెలుగు వారు అయి ఉండి బీజేపీ జాతీయ నాయకులుగా కీలక స్థానంలో ఉన్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు - ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ గురించి ఇదంతా.
పలువురు వినిపిస్తున్న అభిప్రాయం ప్రకారం కొన్ని సందర్భాల్లో తన మంత్రి వర్గ సహచరుడు అయిన వెంకయ్య నాయుడు కంటే రాంమాధవ్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కువగా గౌరవిస్తారట. ఎందుకంటే... బీజేపీ ఖాతాలో అనేక అనూహ్య విజయాలు రాంమాధవ్ వల్ల చేరడమే కారణం. ఇక ప్రస్తుత విషయానికి వస్తే ఐదురాష్ట్రాల ఎన్నికల్లో మణిపూర్ లో బీజేపీకి మెజారిటీ లేకపోయినా కమల వికాసం ఖాయయింది. దీని వెనుక ఉంది ప్రధాని మోడీ బృంద సభ్యుడు - తెలుగువాడైన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్. ఆయన చూపిన చాణక్యం వల్లే అక్కడ బీజేపీ సర్కారును ఏర్పాటుచేయనుంది. నిజానికి అక్కడ బీజేపీ 21 - కాంగ్రెస్ 28 - ఇతరులు 10 - టీఎంసి ఒక సీటు గెలుచుకున్నాయి. ఫలితంగా మణిపూర్ కాంగ్రెస్ ఖాతాలో కలుస్తుందని చాలామంది భావించారు. అయితే, అక్కడ బీజేపీ ఇన్చార్జిగా ఉన్న రాంమాధవ్ రాత్రికి రాత్రి చక్రం తిప్పి - ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే - మరో పదిమంది స్వతంత్ర ఎమ్మెల్యేలను గవర్నర్ వద్దకు తీసుకువెళ్లి పెరేడ్ చేయించి చాణక్యం ప్రదర్శించారు. దీనితో కంగుతిన్న ప్రస్తుత సీఎం ఇబోబిసింగ్.. గవర్నర్ వద్దకు తన వద్ద ఉన్న 27మంది ఎమ్మెల్యేలను తీసుకువెళ్లే ప్రయత్నం నెరవేరకపోవడంతో, వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. అయినా రాంమాధవ్ తమ వద్ద ఉన్న 32 మంది ఎమ్మెల్యేలను గవర్నర్ నజ్మాహెప్తుల్లా ఎదుట ప్రదర్శించడం ద్వారా మణిపూర్ లో కమల వికాసానికి కారణమయ్యారు.
గతంలో జమ్ము-కాశ్మీర్ లోనూ రాంమాధవ్ కీలక పాత్ర పోషించారు. కీలకమైన ఈ రాష్ట్రంలో బీజేపీ గెలుపు వ్యూహాలు రచించడమే కాదు పీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడంలోనూ రాంమాధవ్ ప్రధానమైన పాత్ర పోషించారు. ఆ తర్వాత సంభ్రమాశ్చర్యం కలిగించిన అసోం విజయాల్లో కూడా రాంమాధవ్ కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/