Begin typing your search above and press return to search.
కేంద్ర మంత్రి పదవి వద్దంటున్న తెలుగు అగ్రనేత
By: Tupaki Desk | 22 May 2016 5:34 AM GMTరామ్‌మాధవ్...బీజేపీ ప్రధాన కార్యదర్శి కార్యదర్శి మాత్రమే. ప్రధానమంత్రి నరేంద్రమోడీ టీంలో కీలక సభ్యుడు. కాశ్మీర్ వంటి సంక్లిష్ట రాష్ట్రంలో బీజేపీని అధికారపీఠంపై కూర్చోబెట్టిన వ్యూహకర్త. అసోంలో విజయం సాధించడంలో రామ్‌మాదవ్‌ది ప్రముఖ పాత్రం. ఇలా బీజేపీని విజయతీరాలకు చేర్చడంలో ముందున్న రామ్ మాదవ్ తాజాగా మీడియాతో ఆశ్చర్యకర కామెంట్లు చేశారు.
అసోంలో పార్టీకి అఖండ విజయం సాధించిపెట్టిన నేపథ్యంలో రామ్ మాధవ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అసోం ఎన్నికల్లో విజయానికి ఎంతోమంది కృషి ఉందని, ఎన్నో అంశాలు అక్కడ బలంగా పని చేశాయని చెప్పారు. ఈ ఫలితాలకు సూత్రదారిగా ఉన్న తను కేంద్ర కేబినెట్ లో చేరనున్నట్టు వస్తున్న వార్తలను రామ్ మాధవ్ ఖండించారు. నేను మంత్రిగా కాదు - మహా మంత్రి (ప్రధాన కార్యదర్శి)గా ఉంటూ పార్టీ పటిష్టానికి కృషి చేస్తానని చమత్కరించారు. 2019 ఎన్నికల్లో మరిన్ని లోక్ సభ స్థానాల్లో విజయం సాధించేలా పార్టీని సిద్ధం చేస్తామని చెప్పారు. కేరళ నుంచి బెంగాల్ వరకు కోరమండల్ తీరంలోని అన్ని రాష్ట్రాల్లో బిజెపిని పటిష్టం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. గత రెండేళ్లలో మోదీ ప్రభుత్వం దేశాభివృద్ధికి ఎంతో చేసిందన్నారు. ఆ ఫలాలే ఇప్పుడు ప్రజలకు చేరుతున్నాయని, రాబోయే రోజుల్లో మరిన్ని ఫలితాలు ప్రజలకు అందుతాయన్నారు.
ప్రతి రాష్ట్రంలో కుల రాజకీయాలు ఉంటాయి కానీ, మోదీ ప్రభుత్వం మంచి పనుల ద్వారా బిజెపిని పటిష్టం చేస్తామన్నారు. మత అసహనం ప్రతిపక్షాల రాజకీయ కుట్ర అని, మోదీని అపఖ్యాతిపాలు చేసేందుకు తెరపైకి తెచ్చాయని ఆరోపించారు. రెండేళ్ల రిపోర్ట్ కార్డును ఈనెల 26న శహరాన్‌పూర్ ర్యాలీలో మోదీ ప్రజల ముందు పెడతారని రామ్‌మాధవ్ చెప్పారు. బిజెపి మంత్రులు - నాయకులు - ఇతర ప్రముఖులు 27నుంచి తమ ప్రాంతాలకు వెళ్లి రిపోర్టు కార్డు వివరాలను ప్రజలకు వివరిస్తారన్నారు.