Begin typing your search above and press return to search.
ఆ ఆంధ్రా యువ ఎంపీకి టీఆర్ఎస్ మద్దతు ఎందుకు?
By: Tupaki Desk | 18 Feb 2022 9:32 AM GMTనిన్నటి వేళ కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి. వేడుకలకు ఆంధ్రా నుంచి కూడా భాగస్వామ్యం దక్కింది. ముఖ్యంగా శ్రీకాకుళం యువ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ,గతంలో తమ ఇంటి వివాహ వేడుకలకు రావాల్సిందిగా ఆయనను ఆహ్వానిస్తున్న ఫొటోను పోస్టు చేశారు.ఈ పోస్టుకు రామూ అభిమానులు మంచి స్పందన వచ్చింది.అటు టీఆర్ఎస్ శ్రేణులు సైతం ఆనందం వ్యక్తం చేశాయి.
ఇక ఇదే సందర్భంలో కల్వకుంట్ల కుటుంబానికి, కింజరాపు కుటుంబానికి ఉన్న అనుబంధం గురించి ప్రస్తావించాలి.దివంగత దిగ్గజ నేత ఎర్రన్నాయుడుతో మొదట్నుంచి కేసీఆర్ కు మంచి సంబంధాలే ఉన్నాయి.
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు మంత్రిగా పనిచేసినప్పుడు కూడా కేసీఆర్ తో బంధాలు ఉన్నాయి.
వాటికి కొనసాగింపుగానే ఇవాళ ఎంపీ రాము ఉన్నారు అన్నది నిర్వివాదాంశం.అదేవిధంగా పార్లమెంట్ సెషన్స్ లో ఆంధ్రా పరిణామాలు, ముఖ్యంగా విభజన చట్టం అమలు తదితర సమస్యలపై ఎంపీ రామూ ఎప్పుడు మాట్లాడినా కూడా టీఆర్ఎస్ సభ్యుల మద్దతు ఉంటోంది. అదేవిధంగా నిజమాబాద్ ఎంపీగా కవిత ఉన్నప్పుడు కూడా ఓ సందర్భంలో విభజన కారణంగా ఆంధ్రా ఏ విధంగా నష్టపోయిందో చెబుతూనే, ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని పట్టుబట్టారు.ఆ రోజు జై ఆంధ్రా నినాదం చేశారు.
అంతేకాదు విభజన చట్టం అమలులో నెలకొంటున్న అలసత్వంపై ఎప్పుడు ఎంపీ రామూ మాట్లాడినా ఆ రోజు ఫ్లోర్ లో ఉన్న కవిత తో సహా ఇతర తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు అభినందించిన సందర్భాలు అనేకం.అంతేకాదు మంత్రి హరీశ్ రావు సైతం విభజన చట్టం అమలులో ఇరు రాష్ట్రాలూ కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయనే అంటున్నారు.
ఇక కేసీఆర్ కూడా ఎంపీ రామూను ఉద్దేశిస్తూ అనేక సార్లు అభినందించిన దాఖలాలు ఉన్నాయి.రేపటి వేళ కేంద్రంపై చేసే పోరాటానికి కేసీఆర్ తో సహా ఇతర టీఆర్ఎస్ నాయకులు ఎంపీ రామూతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారనే తెలుస్తోంది.ముఖ్యంగా నిన్నటి కేంద్ర హోం శాఖ సమావేశం విఫలం కావడంతో రేపటివేళ ఉద్యమ కార్యాచరణను ఢిల్లీ కేంద్రంగా ఉద్ధృతం చేయాలనుకుంటే అందుకు ఎంతో వాగ్ధార ఉన్న నేత ఎంపీ రామూ సాయం కేసీఆర్ కు ఎంతో అవసరం.