Begin typing your search above and press return to search.

కోవింద్.. అలా కంగారు ప‌డ్డారేంటి?

By:  Tupaki Desk   |   25 July 2017 8:19 AM GMT
కోవింద్.. అలా కంగారు ప‌డ్డారేంటి?
X
ఊహించ‌ని ప‌రిణామం చోటు చేసుకుంది. అయితే.. అది లిప్త మాత్రమే. క్ష‌ణాల పాటే సాగిన‌ప్ప‌టికీ.. ప‌లువురి దృష్టిని ఈ వ్య‌వ‌హారం ఆక‌ర్షించింది. భార‌త 14వ రాష్ట్రప‌తిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన రామ్ నాథ్ కోవింద్ ను ప్ర‌ణ‌బ్ దా అభినందించారు. చాలాసేపు ఆయ‌న క‌ర‌చాల‌నం ఇవ్వ‌టం క‌నిపించింది.

ఇది పూర్తి అయిన త‌ర్వాత‌.. పుస్త‌కంలో సంత‌కం చేసిన కోవింద్ ను.. అప్ప‌టివ‌ర‌కూ తాను కూర్చున్న కుర్చీని వదిలిన ప్ర‌ణ‌బ్‌.. కోవింద్‌ను కూర్చున్నారు. అప్ప‌టివ‌ర‌కూ కోవింద్ కూర్చున్న‌కుర్చీలో ప్ర‌ణ‌బ్ కూర్చున్నారు. ఇది జ‌రిగిన కొద్ది క్ష‌ణాల‌కే.. కొత్త రాష్ట్రప‌తికి గౌర‌వ వంద‌నంగా 21 శ‌త‌ఘ్నుల్ని పేల్చి గౌర‌వ వంద‌నం స‌మ‌ర్పించారు.

రాష్ట్రప‌తి ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వం సంద‌ర్భంగా జ‌రిగే ప్రోసీజ‌ర్ గురించి అవ‌గాహ‌న లేదా? లేదంటే మ‌ర్చిపోయారో తెలీదు కానీ.. రాష్ట్రప‌తిగా కుర్చీలో కూర్చున్న క్ష‌ణాల వ్య‌వ‌ధిలోనే పెద్ద ఎత్తున శ‌బ్దాలు వ‌స్తూ మోత‌లు వినిపించ‌టంతో ఒక్క‌సారిగా త‌న కుర్చీలో నుంచి కోవింద్ లేచారు.

చుట్టూ ఉన్న వారు ప్ర‌శాంతంగా ఉండ‌టంతో మూడు నాలుగు సెక‌న్లు నిలుచున్న ఆయ‌న‌.. ఆ త‌ర్వాత విష‌యాన్ని అర్థం చేసుకున్న వారిలా త‌న కుర్చీలో కూర్చుండిపోయారు. రాష్ట్రప‌తిగా కుర్చీలో కూర్చున్న కొద్ది క్ష‌ణాల‌కే కోవింద్ కాస్తంత త్రోటుపాటుకు గురి కావ‌టం.. క‌ల‌వ‌రంలో త‌న సీటు నుంచి లేచి నిల‌బ‌డ‌టం కొంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.