Begin typing your search above and press return to search.
రాక్ స్టార్ బాబా... కోర్టులో కుప్పకూలిపోయారే!
By: Tupaki Desk | 28 Aug 2017 11:51 AM GMTబాబా అవతారం ఎత్తి అరాచకాలకు పాల్పడ్డ డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. తన ఆశ్రమంలో సాద్వీలుగా కొనసాగుతున్న ఇద్దరు మహిళలపై అత్యాచారాలకు పాల్పడటమే కాకుండా హత్యారోపణలు ఉన్న గుర్మీత్ సింగ్ ను దోషిగా తేలుస్తూ మొన్న పంచకులలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే నాడు శిక్షను ఖరారు చేయని కోర్టు... ఏ తరహా శిక్ష వేయాలన్న విషయాన్ని నేటికి వాయిదా వేస్తూ తీర్పు చెప్పింది. అయితే గుర్మీత్ ను దోషిగా తేల్చిన మరుక్షణమే అతడి అనుచర వర్గం ఉత్తర భారతంలో చేసిన ఆగడాలతో దేశం అట్టుడికిపోయింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా తీవ్రంగానే స్పందించారు. ఇక గుర్మీత్ అల్లరి మూకలు పాల్పడ్డ అచారకాలను అదుపు చేయలేకపోయారన్న ఆరోపణలతో ఏకంగా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వానికి కేంద్రం చీవాట్లు కూడా పెట్టింది.
ఈ క్రమంలో మరోమారు అల్లర్లు చెలరేగే ప్రమాదముందన్న భావనతో రోహ్ తక్ జైల్లోనే సీబీఐ ప్రత్యేక కోర్టును తాత్కాలికంగా ఏర్పాటు చేసిన యంత్రాంగం... అక్కడే శిక్షను ఖరారు చేసే ఏర్పాట్లను చేసింది. ఈ క్రమంలో నేటి మధ్యాహ్నం జైలు ఆవరణలో ఏర్పాటు చేసిన తాత్కాలిక కోర్టులో గుర్మీత్ కు పదేళ్ల పాటు కఠిన కారాగార శిక్ష విధిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి గుర్ దీప్ సింగ్ సంచలన తీర్పు వెలువరించారు. తీర్పు వెలువడిన వెంటనే రాక్ స్టార్ బాబాగా పేరుగాంచిన గుర్మీత్ బోరున విలపిస్తూ కోర్టు ప్రాంగణంలోనే కింద పడిపోయి తీవ్ర స్థాయిలో రోధించారట. తాను ఏ తప్పూ చేయలేదని - నిరపరాదినని ఏడుస్తూ జడ్జికి మొరపెట్టుకున్నారు. ఇక శిక్ష ఖరారైన తర్వాత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కు జైలులోనే వైద్య పరీక్షలు నిర్వహించారు.
నిబంధనల ప్రకారం ఆయనకు సెల్ ను కేటాయించి, శిక్షఖైదీలకు ఇచ్చే తెల్లటి దుస్తులను అందించారు. ఇన్నాళ్లూ కళ్లు మిరుమిట్లు గొలిపేలా రంగురంగుల దుస్తులేసుకున్న బాబా మరో 10 ఏళ్లపాటు వాటికి దూరంగా ఉండాల్సిందే. ఇదిలా ఉంటే... డేరా బాబా గొప్ప సామాజిక సేవకుడని - దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తించైనా నిరపరాధిగా విడిచిపెట్టాలని లేదా శిక్షను తగ్గించాలని డిఫెన్స్ న్యాయవాది వాదించారు. అయితే అత్యాచారం కేసులో దోషిగా తేలిన గుర్మీత్‌కు 10 ఏళ్లు తక్కువ కాకుండా శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది జడ్జికి విన్నవించారు. ఇరు వర్గాల వాదన విన్న న్యాయమూర్తి సీబీఐ తరఫు న్యాయవాది వాదన వైపు మొగ్గి గుర్మీత్ కు పదేళ్ల జైలు శిక్ష విధించారు.