Begin typing your search above and press return to search.
‘తెలుగువారికి ప్రాధాన్యం' .. రామ్ రాజ్ కి తమిళులు షాక్ !
By: Tupaki Desk | 22 July 2021 9:12 AM GMTరామ్ రాజ్ కాటన్స్ .. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అత్యంత పాపులారిటీ ఉన్న సంస్థ. వివాహం, ఉత్సవం ఇలా సందర్భం ఏదైనా కూడా రామ్ రాజ్ కాటన్స్ ఉండాల్సిందే. ముఖ్యంగా దేవాలయాలకి వెళ్లే సమయంలో ఈ రోజుల్లో పెద్దలు , పిల్లలు రామ్ రాజ్ పంచలు కట్టుకోవడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. చూడటానికి అందంగా , ట్రెడిషనల్ గా ఉండటం తో అతి తక్కువ సమయంలో రామ్ రాజ్ కాటన్స్ ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే .. #tamilsrejectramrajproducts.. బుధవారం సాయంత్రం నుంచి ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్ ఇది.
అసలు ఈ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అవ్వడానికి అసలు కారణం ఏంటంటే .. తమిళులకు ఎంతో ప్రీతిపాత్రమైన బట్టల దుకాణాల్లో రామ్ రాజ్ కాటన్స్ మొదటి వరుసలో ఉంటుంది. రామ్ రాజ్ కాటన్స్ మొదలైంది కూడా తమిళనాడులోనే కావడం విశేషం. ఆ తర్వాత కేరళ, ఏపీ, తెలంగాణ, కర్ణాటకల్లోనూ రామ్ రాజ్ కాటన్స్ విస్తరించింది. ఉత్తరాదిన కూడా అక్కడక్కడా స్టోర్లు ఉన్నాయి. మరి రామ్ రాజ్ ఉత్పత్తులను స్వయంగా తమిళులే బాయ్ కాట్ చేయడం ఏంటి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ సంస్థ ఉద్యోగాల కోసం ఇచ్చిన ఒక ప్రకటనే తమిళ జనాల ఆగ్రహానికి కారణం.
తమిళనాడులోని మధురై, తిరుప్పూరు ప్రాంతాల్లో తమ సంస్థలో ఉన్న ఖాళీలకు రామ్ రాజ్ కాటన్ వాళ్లు ఇచ్చిన ప్రకటనలో ఐటీ ఎగ్జిక్యూటివ్, హెచ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల అర్హతల్లో తెలుగువారికి ప్రాధాన్యం అని ప్రకటన లో ఇచ్చింది. అది తమిళ జనాలకు అంతగా పడలేదు. తమిళనాడు లో తమిళ సంస్థలో ఉద్యోగాలకు ప్రకటన ఇచ్చి, తెలుగు వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం పట్ల తమిళ జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చెన్నై సహా కొన్ని సిటీల్లో తెలుగు వారు చాలా ఉద్యోగాలు దక్కించుకున్నారని, అలాంటిది ఇప్పుడు ఓ తమిళ సంస్థ ఏరికోరి తెలుగు వారికి ఉద్యోగాలు ఇవ్వడం ఏంటన్నది తమిళ జనాల అభ్యంతరం.
అందుకే రామ్ రాజ్ మీద తమ ఆగ్రహాన్ని చూపిస్తూ ట్విట్టర్లో ట్రెండ్ మొదలుపెట్టేశారు. ఇకపై రామ్ రాజ్ ఉత్పత్తులేమీ వాడమంటూ తమిళ నెటిజన్లు ట్విట్స్ చెప్తున్నారు. ఇలా ప్రకటన ఇవ్వడంతోనే రామ్ రాజ్ కాటన్ యాజమాన్యం క్షమాపణ చెప్పి, సదరు ఉద్యోగాలను తమిళులకే ఇవ్వాలని, లేదంటే ఇకపై రామ్ రాజ్ ఉత్పత్తులే కొనమని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇలాంటి విషయాల్లో తమిళ జనాల పట్టుదల ఎలా ఉంటుందో తెలిసిందే కాబట్టి వారి డిమాండ్ల పై రామ్ రాజ్ కాటన్స్ ఏ విదంగా స్పందిస్తుందో చూడాలి.