Begin typing your search above and press return to search.
పన్నీర్ సెల్వంను కేరళ సీఎం చేసిన కేంద్ర మంత్రి
By: Tupaki Desk | 24 Jan 2017 9:58 AM GMTవ్యక్తిగతంగా అవగాహన లేకపోవడమమో.. లేదంటే తమ తరఫున సోషల్ మీడియా పేజీలను నిర్వహించే బాధ్యతలు చూసుకునేందుకు సరైన అవగాహన లేనివారిని పెట్టుకోవడం వలనో కానీ కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ పెద్ద పొరపాటు చేశారు. తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వంను కేరళ సీఎంగా ఆయన అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో పోస్టింగ్ పెట్టడం.. ఆ అవగాహన రాహిత్యంపై నెటిజన్లు మండిపడడంతో ఆయన వెంటనే సర్దుకుని ఆ ట్వీట్ ను సవరించారు.
కేరళ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తనను కలిశారంటూ కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ చేసిన ట్వీట్ పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కేంద్ర మంత్రి అయి ఉండి, తనను కలిసింది ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో తెలియకపోతే ఎలా అని మండిపడుతున్నారు.
ఇంతకీ, రాం విలాస్ పాశ్వాన్ ఎందుకు ట్వీట్ చేశారంటే.. కేరళ సీఎం పినరయి విజయన్ ఆయన్ని కలిశారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా రాం విలాస్ పోస్ట్ చేసే క్రమంలో కేరళ ముఖ్యమంత్రి పేరు విషయంలో పొరపాటు పడ్డారు. అయితే, నెటిజన్ల ట్వీట్లతో తాను పొరపాటు పడ్డాననే విషయం గ్రహించిన రాం విలాస్ - ఆ ట్వీట్ ను డిలీట్ చేసి..కేరళ సీఎం పినరయి విజయన్ అంటూ మళ్లీ పోస్ట్ చేయడం గమనార్హం. మొత్తానికి బీకాంలో ఫిజిక్సు చదివానంటూ మీడియాతో వాదించిన ఏపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తరహాలోనే కేంద్ర మంత్రి చులకనైపోయారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/