Begin typing your search above and press return to search.

బీహార్ ఎన్నికల్లో 'రామా'యణం

By:  Tupaki Desk   |   18 Oct 2015 5:30 PM GMT
బీహార్ ఎన్నికల్లో రామాయణం
X
ఆశ్చర్యపోతున్నారా... రాముడేమిటి.. ? బీహార్ ఎన్నికల్లో పోటీచేయడమేమిటి..? అది కూడా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయడం.. దేవుడు సర్వాంతర్యామి కదా ఎన్ని నియోజకవర్గాల్లోనైనా పోటీ చేస్తాడు అని సర్దిచెప్పుకోండి. నిజమే బీహార్ లోని ఒక్క నియోజకవర్గం మినహా ప్రతి చోటా రాముడు పోటీలో ఉన్నాడట. ఈ సంగతి ఎన్నికల సంఘమే స్వయంగా చెబుతోంది. ఒక్క నియోజకవర్గం మినహా ప్రతి నియోజకవర్గంలోనూ రామ్ అనే పేరున్న అభ్యర్థి కనీసం ఒకరైనా ఉన్నారట. కొన్ని చోట్ల ముగ్గురు నలుగురు రాముళ్లు కూడా పోటీ చేశారు.

బీహార్ ఎన్నికల్లో అభ్యర్థుల పేర్లలో ఎక్కువగా పురణాల్లోని పేర్లు, దేవుళ్ల పేర్లే ఉన్నాయి. రాముడు - కృష్ణుడు - శత్రుఘ్నుడు - శివ - శకుని - అర్జున్ - కుంతీ - ప్రహ్లాద్ ఇలా... పురణాలతో సంబంధమున్న పేర్లే ఎక్కువగా ఉన్నాయి. అయితే... అన్నిట్లోనూ రాముడి పేరున్న అభ్యర్తుల సంఖ్య బాగా ఎక్కువగా ఉందట.

బీజేపీ తరఫున బరిలో ఉన్నవారిలో 50 మందికిపైగా రాముళ్లు ఉన్నారట. రామ్ - రామ్ జీ - రామ్ సురేందర్ - రామ్ లఖన్ సింగ్ - రామానంద్ - రామ్ దేవి - రామ్ ప్రీత్ .... ఇలా రామ్ తో ముడిపడిన పేర్లు పెద్ద సంఖ్యలో ఉంటున్నాయి. వీటికి చివరన సింగ్ - యాదవ్ - పాశ్వాన్ - మాంజీ వంటి తోకలు ఉండనే ఉండాయి. మరి ఈ రాముళ్లో ఎంతమంది గెలుస్తారో ఎంతమంది ఓడిపోతారో చూడాలి.