Begin typing your search above and press return to search.

రాముడు, హ‌నుమంతుడు బీజేపీ వాళ్లే కారు.. షాకిచ్చిన ఫైర్ బ్రాండ్‌!

By:  Tupaki Desk   |   31 Dec 2022 5:04 AM GMT
రాముడు, హ‌నుమంతుడు బీజేపీ వాళ్లే కారు.. షాకిచ్చిన ఫైర్ బ్రాండ్‌!
X
ఆమె సీనియ‌ర్ రాజ‌కీయ దిగ్గ‌జం. ఫైర్ బ్రాండ్ కు అచ్చుగుద్దిన‌ట్టు స‌రిపోతారు. పైగా పొలిటిక‌ల్ స‌న్యాసి. త‌న మ‌న అనే తేడాలేదు. విష‌యం వివాద‌మైతే చాలు.. ఆమె ఎంట్రీ ఇస్తారు. మ‌రింత వివాదం చేస్తారు. రాజ‌కీయ మంట‌లు మండిస్తారు. అదే ఆమె స్ట‌యిల్‌. ఆమె ఎవ‌రో కాదు.. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత ఉమా భారతి. తాజాగా త‌న సొంత పార్టీ బీజేపీ స‌హా.. విప‌క్ష పార్టీ కాంగ్రెస్‌పైనా ఏక‌కాలంలో విమ‌ర్శ‌లు గుప్పించి.. మీడియాలో నిలిచారు.

శ్రీరాముడు, హనుమంతుడు బీజేపీ కార్యకర్తలు కాదని అన్నారు. అంతేకాదు.. ఆదేవుళ్లు బీజేపీకే ప‌రిమితం కాద‌ని వెల్ల‌డించారు. ఇతరులెవరూ రాముడు, హ‌నుమంతుడి భక్తులు కాకూడదనే తప్పుడు భావాన్ని సృష్టించవద్దని బీజేపీకి హితవు పలికారు. దేవుళ్లు, దేవీ, దేవతలు కుల, మతాలకు అతీతంగా ఉంటార‌ని క‌మ‌ల నాథుల‌కు చుర‌క‌లు అంటించారు. అంతేకాదు.. జనసంఘ్‌కు పూర్వం, మొఘ‌లులు, బ్రిటిషర్లకు పూర్వం కూడా శ్రీరాముడు, హనుమంతుడు ఉన్నారని నిప్పులు చెరిగారు.

ఇక‌, మ‌రోవైపు.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహస్తున్న భారత్ జోడో యాత్రపైనా ఉమా భార‌తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. "నేను రాహుల్ గాంధీని ఓ ప్రశ్న అడుగుతున్నా. భారత దేశం ముక్కలైనట్లు ఆయన ఎక్కడ చూశారో చెప్పాలి. నిజానికి అధికరణ 370ని రద్దు చేయడం వల్ల భారత దేశం బలోపేతమైంది" అని వ్యాఖ్యానించారు.

భారత దేశం ఒకసారి మాత్రమే ముక్కలైందన్నారు. కాంగ్రెస్ దేశాన్ని విభజించినపుడు అది జరిగింద న్నారు. దేశాన్ని ఏకం చేయాలని కాంగ్రెస్ కోరుకుంటే, దేశ విభజనకు పూర్వం భారత దేశంలో ఉన్న ప్రాంతాలను కలపడం గురించి మాట్లాడాలని ఉమా భార‌తి కౌంట‌ర్ ఇచ్చారు.

మ‌రోవైపు.. బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఇటీవల కర్ణాటకలో మాట్లాడుతూ హిందువులు తమ ఇళ్లలో కత్తులను ఉంచుకోవాలని చెప్పిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలను ఉమా భారతి సమర్థించారు. ఇళ్ల‌లో క‌త్తులు ఉంచుకుంటే తప్పు కాదని అన్నారు. అవ‌స‌రం కూడా అని చెప్పారు. దాడి చేసే మనస్తత్వం ఉండటమే తప్పు అని చెప్పారు.

'పఠాన్' సినిమా గురించి మాట్లాడుతూ, కాషాయాన్ని అవమానిస్తే సహించేది లేదన్నారు. ఈ సినిమాలోని అభ్యంతరకర సన్ని వేశాలను సెన్సార్ బోర్డు తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే.. దీనినే ప‌ట్టుకుని రాజకీయం చేయవలసిన అవసరం లేదని చెప్పారు. ద‌టీజ్ ఉమా భార‌తి.. అందుకే ఎవ‌రికీ అర్ధం కాకుండా పోయార‌ని అంటారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.