Begin typing your search above and press return to search.

లేడీ ఐపీఎస్ చేతిలో నయీం ఖతం

By:  Tupaki Desk   |   8 Aug 2016 10:18 AM GMT
లేడీ ఐపీఎస్ చేతిలో నయీం ఖతం
X
మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో ఎన్ కౌంటర్ కు గురైన నయీంను మట్టుబెట్టే ప్లాన్ - యాక్షన్ ప్లాన్ అంతా ఒక లేడీ ఐపీఎస్ నేతృత్వంలో జరిగినట్లు తెలుస్తోంది. డైనమిక్ ఐపీఎస్ అధికారిణిగా పేరున్న రమా రాజేశ్వరి ఈ ఆపరేషన్ టేకప్ చేశారు. ఆమే నేరుగా కార్యరంగంలోకి దిగి ఈ ఆపరేషన్ ను పర్యవేక్షించారు. హైదరాబాద్ సిటీలో డీసీపీ హోదాలో ఉన్న ఈ యువ మహిళా అధికారిణి నేతృత్వంలోనే ఈ ఆపరేషన్ మొత్తం సాగింది. నయీమ్ ను వెంటాడిన పోలీసులు చాకచక్యంగా ఆయనున్న భవనాన్ని చేరుకుని కాల్పులు జరిపారు. మెషిన్ గన్లు చేతబట్టుకున్న పోలీసులు - చెట్లు - డివైడర్లు - గోడలను రక్షణగా చేసుకుని ముందుకు కదిలిన దృశ్యాలుఅక్కడి వీడియో కెమేరాల్లో రికార్డయ్యాయి. దీంతో పక్కా ప్రణాళికతో సర్వ సన్నద్ధంగా ఈ ఆపరేషన్ చేపట్టారని తెలుస్తోంది.

షాద్ నగర్ సమీపంలోని ఓ పెట్రోల్ బంకు నుంచే పోలీసులు పొజిషన్ తీసుకుని రెడీ అయ్యారు. ఇవన్నీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పెట్రోల్ బంకు నుంచే పోజిషన్ తీసుకున్న పోలీసులు... చాలా జాగ్రత్తగా ముందకు కలిదారు. అత్యాధునిక మెషీన్ గన్లను చేతబట్టుకుని రంగంలోకి దిగిన పోలీసులు పెట్రోల్ పంపు వద్ద కూడా వాటిని చేతుల్లో పట్టుకునే కనిపించారు. ఇక నయీమ్ బస చేసిన భవనం వద్ద యాక్షన్ లోకి దిగిన పోలీసులు అక్కడ ఉన్న రోడ్ డివైడర్లు - చెట్లను రక్షణగా చేసుకుని అటాకింగ్ మొదలుపెట్టారు.

ఈ క్రమంలో నయీం గన్ మెన్ నుంచి ప్రతిగా కాల్పులు మొదలవడంతో గ్రేహౌండ్సు బలగాలు ఒక్కాసారిగా తూటాల వర్షం కురిపించాయి. దీంతో నయీం తప్పించుకునే అవకాశం లేకుండాపోయి తూటాలకు దొరికి కుప్పకూలిపోయాడు. నయీం మరణించే సమయంలో ఆయన పక్కనే ఒక మహిళ కూడా ఉంది. ఆమె కూడా ఈ ఆపరేషన్ లో మృతిచెందింది. కాగా నయీం ఎన్ కౌంటర్ లో కీలకంగా మారిన ఐపీఎస్ అధికారిణి రమారాజేశ్వరి కేరళలోని మున్నార్ కి చెందినవారు. డైనమిక్ ఆఫీసర్ గా పేరున్న ఆమె గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ తో ఒక్కసారిగా పాపులర్ అవుతున్నారు.