Begin typing your search above and press return to search.
రాహుల్ నాయకుడిగా ఉన్నంత వరకూ మోడీకి తిరుగులేదట!
By: Tupaki Desk | 18 Jan 2020 7:13 AM GMTప్రధానమంత్రి నరేంద్రమోడీ కి తిరుగులేదు అని అంటున్నారు చరిత్రకారుడు రామచంద్ర గుహా. దేశంలో ప్రముఖుల్లో ఒకరైన రామచంద్రగుహ ప్రస్తుత రాజకీయ పరిణామాలను విశ్లేషిస్తూ ఆసక్తిదాయకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీని సెల్ఫ్ మేడ్ మ్యాన్ అని అన్నారు గుహా. మోడీ ఎలాంటి వారసత్వం లేకుండా గొప్ప స్థాయికి ఎదిగారని గుహ అభిప్రాయపడ్డారు. అదే రాముల్ విషయానికి వస్తే కథ రివర్స్ లో ఉంటుందని అన్నారు.
రాహుల్ రాజకీయ వారసత్వాన్ని గుహ ప్రస్తావించారు. రాహుల్ ఒకే కుటుంబానికి సంబంధించిన ఐదో తరం రాజకీయ నేత అని గుహ గుర్తు చేశారు. అలా ఐదో తరం వ్యక్తికి దేశ రాజకీయాల్లో ఎలా స్థానం ఉంటుందని ఆయన ప్రశ్నించారు. అలాంటి రాహుల్ ఉన్నంత వరకూ మోడీకి తిరుగులేదని అభిప్రాయపడ్డారు. ఇలా మోడీ విజయ రహస్యం రాహుల్ గాంధీనే అని ఈ పరిశీలకుడు అభిప్రాయపడ్డారు.
రామచంద్రగుహ అలా బీజేపీకి అనుకూలుడు కాదు, కాంగ్రెస్ కు వ్యతిరేకీ కాదు. దాదాపు ఒక తటస్థ వ్యక్తిలాగా ఈయన ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ విషయాన్ని ఇది వరకూ అనేక మంది ప్రస్తావించారు. రాహుల్ ఉత్తరాదిన ప్రజలను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోతూ ఉండటం వల్లనే మోడీ దూసుకుపోతూ ఉన్నాడనే అభిప్రాయాలు చాలా మంది చెప్పారు.
కానీ ఆ పరిస్థితి క్రమంగా మారుతోందనే టాక్ కూడా ఉంది. వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అనుకూల ఫలితాలు వచ్చాయి. దీంతో రాహుల్ నాయకత్వంలోనే కాంగ్రెస్ దశ తిరుగుతుందనే అభిప్రాయాలు ఇప్పుడిప్పుడే వినిపిస్తున్నాయి. కానీ ఇంతలో రామచంద్రగుహ మళ్లీ పాత అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. రాహుల్ నాయకత్వం కాంగ్రెస్ కు ఉన్నంత వరకూ మోడీకి తిరుగులేదని తేల్చేశారు!