Begin typing your search above and press return to search.
ఒక్క రోజులోనే బాబులో ఎంత తేడా?
By: Tupaki Desk | 29 Oct 2016 12:48 PM GMTరాష్ట్ర విభజన అనంతరం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఏపీ ముఖ్యమత్రి నారా చంద్రబాబు నాయుడు మాటతీరులో ఉన్న తేడా వల్లే తాము ఈ విధంగా నిధుల విషయంలో క్లారిటీ కోరుతున్నామని తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాష్ట్ర పర్యటనకు ముందు - రాష్ట్ర పర్యటన తర్వాత చంద్రబాబు ప్రకటనల్లో స్పష్టమైన తేడా ఉండటం వల్లే శ్వేతపత్రం అడుగుతున్నామని అంశాల వారీగా రామకృష్ణ వివరించారు.
రాష్ట్ర విభజనానంతరం ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ తో ఉంటుందని ఆర్థిక నిపుణులు పేర్కొనడంతో ఆంధ్ర ప్రాంత సమగ్రాభివృద్ధికి - రాజధాని నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామని పేర్కొంటూ వెనుకబడిన రాయలసీమ - ఉత్తరాంధ్రలకు బుందేల్ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఆదుకుంటామని ఆనాటి కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయాన్ని రామకృష్ణ ప్రస్తావించారు. అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించిన సమయంలో ప్యాకేజీ కంటితుడుపు చర్య తప్ప మరొకటి కాదని ప్రతిపక్షాలన్నీ విమర్శించగా ప్యాకేజీకి చట్టబద్ధత ఇవ్వాలని చంద్రబాబు కోరిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విజయవాడ రావడానికి ముందు వరకూ కూడా చట్టబద్ధత కోరతామన్న చంద్రబాబు ఆయన రాగానే మాటమార్చారని మండిపడ్డారు. అరుణ్ జైట్లీ వచ్చి మిమ్మల్ని ఏం మాయచేసారో గానీ కనీసం ప్యాకేజీకి చట్టబద్ధత గురించి కూడా ఆయనతో మాట్లాడలేదని రామకృష్ణ తప్పుపట్టారు. పైగా ప్రత్యేక హోదా - ప్యాకేజీ రెండింటికీ తేడా లేదనడం, హోదావల్ల కేంద్ర పథకాలకు వచ్చే 90% నిధులను విదేశీ సంస్థల నిధులతో భర్తీ చేస్తామని మీరు చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం చేయలేని సహాయం విదేశీ సంస్థలు ఏ ప్రయోజనాలు ఆశించకుండా ఎందుకు చేస్తాయని రామకృష్ణ నిలదీశారు.
కేంద్రం నుండి సహకారం అందడంలేదని ఇన్నాళ్లు చెప్పిన చంద్రబాబు తాజాగా జరిగిన శంఖుస్థాపనలో కేంద్రం పూర్తిగా సహకారం అందిస్తున్నదని చెప్పడం వెనుక కారణం ఏమిటని రామకృష్ణ ప్రశ్నించారు. ఒకసారి రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం అంటూనే, మరోసారి ప్యాకేజీ అయినా హోదా అయినా ఒకటే అంటుండటం రెండు నాల్కల ధోరణికి అద్దం పడుతున్నదని ధ్వజమెత్తారు. బీజేపీ మైత్రి కొనసాగించాలనే ఒక రాజకీయ నిర్ణయంతో ఈ రకంగా చంద్రబాబు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయ అవసరాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతుండటం వల్లే కేంద్రప్రభుత్వం నుండి రావలసిన విభజన హామీలు సరిగా రావడంలేదని ఆరోపించారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ రెండేళ్ళకాలంలో రాష్ట్రానికి ఏ మేరకు నిధులు ఇచ్చిందో, విభజన హామీలు ఏ మేరకు అమలు చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని రామకృష్ణ కోరారు. విశాఖ రైల్వేజోన్, కడపలో సెయిల్ ఆధ్వర్యంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు పరిశీలన, కేంద్ర విద్యా వైద్య సంస్థలు ఏర్పాటు, పోలవరం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి కేంద్ర నిధులతో పూర్తిచేస్తామనే హామీలతోపాటు రాష్ట్రానికి 5 ఏళ్ళపాటు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా చెప్పిన వాటిపై ఈ శ్వేతపత్రంపై పూర్తి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/