Begin typing your search above and press return to search.

రామకృష్ణ సెకండ్ వీడియో.. సంచలన నిజాలు

By:  Tupaki Desk   |   8 Jan 2022 9:44 AM GMT
రామకృష్ణ సెకండ్ వీడియో.. సంచలన నిజాలు
X
కొత్తగూడెం ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవపై సంచలన ఆరోపణలు చేసిన రామకృష్ణ మరో వీడియో బయటకు వచ్చింది. భార్యపిల్లలను చంపి తనూ ఆత్మహత్య చేసుకున్న రామకృష్ణ చనిపోయే ముందు సెల్ఫీ వీడియోలు తీసుకున్నారు. నిన్న విడుదల చేసిన వీడియోలో తన భార్యను రాఘవ పంపమన్నాడని సంచలన ఆరోపణలు చేశారు. అందుకే చనిపోతున్నట్టు వివరించాడు.

తాజాగా విడుదల అయిన రెండో సెల్ఫీ వీడియోలో మరిన్ని సంచలన విషయాలు చెప్పుకొచ్చాడు. ఈ వీడియో చూసేటప్పటికీ తాను బతికి ఉంటానో లేదో తెలియదని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఎందుకు చనిపోతున్నానే విషయం ప్రజలకు తెలియాలని.. నాకు కొన్ని బాధ్యతలున్నాయని..నాకు డబ్బులిచ్చిన వారికి న్యాయం జరగాలనే ఉద్దేశం మీదే ఈ వీడియో తీస్తున్నట్టు తెలిపాడు.

ఈ వీడియో చూశాక నా తండ్రి ద్వారా నాకు సంక్రమించే ఆస్తిలో నన్ను నమ్మి నాకు డబ్బులిచ్చిన వారికి.. అప్పులిచ్చిన వారికి నా వాటాలోంచి చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.

నేను ఆత్మహత్య చేసుకోవడానికి మొదటి పాత్రధారి.. సూత్రధారి వనమా రాఘవేంద్రరావు అని రామకృష్ణ సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చాడు. ‘గత 20 సంవత్సరాల నుంచి మా అక్కతో తనకున్న అక్రమ సంబంధం.. దీనికి మధ్యవర్తిగా సహకరిస్తున్న మా అమ్మగారు.. వీళ్లు ముగ్గురూ కలిసి నాకు నా తండ్రి ద్వారా న్యాయబద్దంగా రావాల్సిన ఆస్తిని నాకు ఇవ్వకుండా వేధిస్తున్నారని’ రామకృష్ణ ఆరోపించారు. సంవత్సరం నుంచి పెండింగ్ లో పెట్టి తనను అప్పుల ఊబిలోకి నెట్టేసి చావు తప్ప వేరే మార్గం లేకుండా ఈ పరిస్థితి తీసుకొచ్చారని రామకృష్ణ ఆరోపించారు.

అక్రమ సంబంధం వల్ల ఒక కుటుంబం నాశనం నాశనమయ్యే పరిస్థితికి తీసుకొచ్చారని.. ఒక వంశాన్ని నాశనం చేస్తున్నారని.. దయచేసి వీళ్లను ఏం చేస్తారన్నది సమాజానికే వదిలేస్తున్నానని రామకృష్ణ చెప్పుకొచ్చారు.

నేను మా అక్కమీద.. వనమా రాఘవ మీద అనవసరంగా ఆరోపణలు చేస్తున్నానని.. మా అక్క ఉండేది రాజమండ్రి.. ఈయన పాల్వంచలో ఉంటే ఇది ఎలా సాధ్యమని అనిపించవచ్చని.. ఆ అనుమానం నివృత్తి చేస్తానని రామకృష్ణ తెలిపారు. నా ఆస్తి పంపకంలో వనమా రాఘవ ఎందుకు ఇంతలా ఇన్ వాల్వ్ అయ్యి ఇంత వేధిస్తున్నదానికి కారణం మీకే అర్థమవుతోందని వీడియోలో చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం విడుదలైన ఈ రెండో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే వనమా రాఘవను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.