Begin typing your search above and press return to search.

కారణజన్ముడు జగన్.. అంతలా పొగిడేసింది ఎవరంటే?

By:  Tupaki Desk   |   5 April 2021 4:41 AM GMT
కారణజన్ముడు జగన్.. అంతలా పొగిడేసింది ఎవరంటే?
X
అధికారంలో ఉన్నప్పుడు కొన్ని నిర్ణయాల్ని తీసుకునే విషయంలో ఆచితూచి అన్నట్లుగా ఉండాలి. ఏదో చేయాలన్న ఉద్దేశంతో మరేదో చేయటం వల్ల కలిగే నష్టం భారీగా ఉంటుంది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తిరుమల శ్రీవారి ఆలయానికి మిరాశీ వ్యవస్థకు చెక్ చెబుతూ తీసుకున్న నిర్ణయం కారణంగా.. వంశపారంపర్య హక్కును కోల్పోవటం.. బాబు సర్కారుపై తీవ్ర విమర్శలు చేయటం తెలిసిందే. విపక్ష నేతగా ఉన్నప్పుడు.. తాము అధికారంలోకి వస్తే.. ఆర్చకుల వంశపారంపర్యాన్ని పునరుద్ధరిస్తామన్న హామీని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఇవ్వటం తెలిసిందే.

తాను ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న జగన్.. తాజాగా ఆర్చకుల వంశపారంపర్యంపై సానుకూల నిర్ణయాన్ని తీసుకొని.. ఆదేశాలు జారీ చేశారు. దీంతో.. ఆర్చకులు విపరీతమైన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన ఆర్చకులు ఏవీ రమణదీక్షితులు సీఎం జగన్ ను విపరీతంగా పొగిడేశారు. జగన్.. కారణజన్ముడిలా ధర్మ సంస్థాపన కోసం సనాతన ధర్మాన్ని కాపాడినట్లుగా అభివర్ణించారు.

ధర్మాన్ని భగవంతుడు రక్షించినట్లుగా ఆర్చకులు వంశపారంపర్యాన్ని సీఎం పునరుద్ధరించటంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. జగన్ హిందూ దేవాలయాలు.. ప్రాచీన దేవాలయాల ప్రతిష్టను కాపాడతారని.. ఆలయాలకు పునర్ వైభవం కల్పిస్తారన్న నమ్మకం కలిగినట్లుగా పేర్కొన్నారు.

దివంగత మహానేత వైఎస్ దూరదృష్టితో చేసిన చట్టసవరణను తిరిగి ఆయన కుమారుడు అమలు చేయటం.. స్వామికి సేవ చేసుకునే అవకాశం కలగటం మహా ఆనందంగా ఉందన్నారు. 2018లో అప్పటి చంద్రబాబు సర్కారు మిరాశి ఆర్చకులకు మయోపరిమితి పేరుతో పదవీ విరమణ చేసి బాధ పెట్టినట్లుగా రమణ దీక్షితులు వ్యాఖ్యానించారు. అప్పట్లో బాబు సర్కారు తీసుకున్న నిర్ణయంతో చాలా ఆలయాలు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ తీసుకున్న తాజా నిర్ణయం.. ఆర్చకుల్లో ఆయనపై మరింత అభిమానాన్ని పెంచేలా ఉంటుందని చెప్పక తప్పదు.