Begin typing your search above and press return to search.
రామాయణం కట్టుకథ అంటున్న మహర్షి
By: Tupaki Desk | 3 Dec 2017 1:11 PM GMTషిర్డీ సాయిమహిమలపై గతంలో వివాదాస్పద కామెంట్లు చేసిన రమణానంద మహర్షి మరోమారు అదే రీతిలో రామాయణంపై స్పందించారు. రామాయణం అంతా ఓ కట్టుకథ అని ఆరోపించారు. రామాయణం, మహాభారతాలు కేవలం హిందువులకు మాత్రమే సంబంధించిన అంశాలు కాదు. ఇవి భారతీయ సంస్కృతికి ప్రతీక. ఉత్తమ విలువలతో కూడిన జీవన విధానానికి మార్గదర్శకాలు. అందుకే వీటిని అందరూ గౌరవిస్తారు. రాముడి మార్గంలో నడవడానికి, భగవద్గీతను తమకు అన్వయించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇతిహాసాల్లో ఒకటైన రామాయణాన్ని రమణానంద మహర్షి తప్పుపట్టారు. అసలు ఇదంతా ఓ కట్టుకథగా అభివర్ణించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా...అదే రీతిలో వివాదం రేగింది.
హనుమంతుడిని ఉద్దేశించి అసలు కోతి ఎలా మాట్లాడుతుందని రమణానంద మహర్షి ప్రశ్నించారు. `ఆంజనేయుడు వానరుడైతే ఎలా మాట్లాడారు? ఇదే నిజమైతే ఇప్పుడు కోతులు ఎందుకు మాట్లాడటం లేదు? ఇప్పుడు కోతులు వేదం నేర్చుకుంటాయా?` ఇది రమణానంద మహర్షి ప్రశ్న. `హనుమంతుడు ఎలాంటి భాషా దోషం లేకుండా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడని రాముడు లక్ష్మణుడికి ఓ సందర్భంలో చెప్తారు. ఇది నిజమైతే ఇప్పుడు కూడా అంతే చక్కగా మాట్లాడాలి కదా?` అని రమాణానంద మహర్షి అన్నారు. `కోతులు పేపర్లు చింపేస్తాయి? మరి అవి చదువుతాయా? ఒకవేళ కోతులు ఇంతవరకు మాట్లాడితే...ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు?` అని ప్రశ్నించారు. వాల్మీకి రాసిన రామాయణంలో అసలు సత్యమే లేదని రమణానంద మహర్షి అన్నారు. 3 రకాల రామయణాలు ప్రచారంలో ఉన్నాయని ఇందులో ఏది సత్యం కాదని ఆయన అన్నారు. ప్రచారంలో ఉన్న రామయాణాల్లో 30%మే సత్యమన్నారు. `రామాయణాల్లో అన్నీ అభూతకల్పనలు. రాముని పాదం తాకి రాయి అహల్య మారిందనేది అసత్య ప్రచారం` అని ఆయన అన్నారు.
రమణానంద మహర్షి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం రేగింది. రమణానంద మహర్షి పనికట్టుకొని అసత్యప్రచారం చేస్తున్నారని పలువురు మండిపడుతున్నారు.