Begin typing your search above and press return to search.

ఒక‌నేత కోసం.. నాడు బాబు.. నేడు జ‌గ‌న్‌.. తిప్పలు!!

By:  Tupaki Desk   |   12 April 2021 1:30 AM GMT
ఒక‌నేత కోసం.. నాడు బాబు.. నేడు జ‌గ‌న్‌.. తిప్పలు!!
X
ఒకే ఒక్క నాయ‌కుడు.. నాడు చంద్ర‌బాబును, నేడు వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌ను తిప్ప‌లు పెడుతున్నా రం టే ఆశ్చ‌ర్యంగా అనిపిస్తుంది. కానీ, ఇది ముమ్మాటికీ వాస్త‌వం అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆయ‌నే పొన్న‌ప‌రెడ్డి రామ‌సుబ్బారెడ్డి. క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆరు సార్లు ఆయ‌న ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి.. కేవ‌లం రెండు సార్లు మాత్ర‌మే విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితేనేం.. ఆయ‌నో ఫైర్ బ్రాండ్ నాయ‌కుడిగా క‌డ‌ప‌లో గుర్తింపు పొందారు.

త‌న రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని.. 1990లో టీడీపీతో ప్రారంభించిన రామ‌సుబ్బారెడ్డి.. 94 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున ‌పోటీ చేసి విజ‌యం సాధించారు. త‌ర్వాత ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న టీడీపీ టికెట్‌పై విజయం ద‌క్కించుకున్నా రు. ఇక‌, ఆ త‌ర్వాత‌.. వ‌రుస ప‌రాజ‌యాలు పొందుతున్నారు. అయితే.. ఇక్క‌డ గెలిచిన వారికంటే కూడా ఓడిన రామ‌సుబ్బారెడ్డే ఎక్కువ‌గా మీడియాలో క‌నిపిస్తుంటారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఆధిప‌త్య రాజకీయం. ఓడినా త‌న‌దే పైచేయి అనే టైపులో రామ‌సుబ్బారెడ్డి వ్యాఖ్యలు చేస్తుంటారు. అధికారుల‌పైనా పెత్త‌నం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తుంటారు.

దీంతో కాంగ్రెస్ నేత‌లైన‌.. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి, గ‌తంలో కాంగ్రెస్ త‌ర‌ఫున మూడు సార్లు విజయం సాధించి న ఆదినారాయ‌ణ రెడ్డి వంటి వారితో ప్ర‌త్య‌క్ష వివాదాలు, విభేదాలు కూడా రామ‌సుబ్బారెడ్డికి ఉన్నాయి. అయితే, 2014 ఎన్నిక‌ల్లో చిత్ర‌మైన ఘ‌ట‌న జ‌రిగింది. ఆ ఎన్నిక‌ల్లో జ‌మ్మ‌ల‌మ‌డుగు నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా రామ‌సుబ్బారెడ్డి పోటీ చేయ‌గా.. వైసీపీ త‌ర‌ఫున‌.. ఆది నారాయ‌ణ రెడ్డి పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నా రు. అయితే.. రాజ‌కీయ వ్యూహంలో భాగంగా.. ఆదిని చంద్ర‌బాబు టీడీపీలోకి చేర్చుకుని మంత్రి ప‌ద‌వి ఇచ్చారు.

అయితే.. ఆది రాక‌ను తీవ్రంగా విభేదించిన రామ‌సుబ్బారెడ్డి.. చంద్ర‌బాబు ద‌గ్గ‌ర పంచాయ‌తీ పెట్టారు. దీంతో ఆయ‌న‌ను బుజ్జ‌గించేందుకు వెంట‌నే ఎమ్మెల్సీ గా అవ‌కాశం క‌ల్పించారు. ఫ‌లితంగా సుబ్బారెడ్డి కొంత శాంతించారు. ఇదిలావుంటే, 2019 ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి.. మ‌ళ్లీ ఇక్క‌డి రాజ‌కీయాలు రివ‌ర్స్ అయ్యాయి. టీడీపీ త‌ర‌ఫున సుబ్బారెడ్డి పోటీ చేసి.. మ‌ళ్లీ ఓడిపోయారు. ఇక‌, వైసీపీ త‌ర‌ఫున డాక్ట‌ర్ సుధీర్ రెడ్డి పోటీ చేసి విజ‌యం సాధించారు. అయితే.. కొన్ని రోజుల‌కు రామ‌సుబ్బారెడ్డి వైసీపీ పంచ‌న చేరారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. రామ‌సుబ్బారెడ్డి త‌న పాత‌ప‌ద్ధతిలో.. ఇక్క‌డ మ‌ళ్లీ ఆధిప‌త్య రాజ‌కీయాల‌కు తెర‌దీశారు.

సొంత పార్టీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై పైచేయి సాధించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రి మ‌ధ్య ఆధిప‌త్య రాజ‌కీయాలు చోటు చేసుకున్నాయి. దీంతో కొన్నాళ్లుగా ఇద్ద‌రి మ‌ధ్య వివాదం ర‌గులుతూ నే ఉంది. ఈ క్ర‌మంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఈ విష‌యాన్ని సీఎం జ‌గ‌న్ దృష్టికి తీసుకురావ‌డం.. ఇద్ద‌రు నేత‌ల‌ను తాడేప‌ల్లికి పిలిచి.. పంచాయ‌తీ పెట్ట‌డం జ‌రిగిపోయాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు ఎమ్మెల్యే టికెట్ కావాల‌ని రామ‌సుబ్బారెడ్డి డిమాండ్ చేసిన‌ట్టు స‌మాచారం. అయితే.. దీనికి జ‌గ‌న్ స‌సేమిరా అన‌డంతోపాటు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ సుధీర్‌రెడ్డికే ఎమ్మెల్యే టికెట్ ఇస్తామ‌ని స్ప‌ష్టం చేసిన‌ట్టు తెలిసింది.

అదేస‌మ‌యంలో రామ‌సుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇస్తామ‌ని.. జ‌గ‌న్ హామీ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. దీంతో ప్ర‌స్తుతానికి ఈ వివాదం స‌మసిపోయింద‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు. కానీ, ఎట్టి ప‌రిస్థితిలోనూ ఎమ్మెల్యే కావాల‌న్న రామ‌సుబ్బారెడ్డి ఆశ అలానే ఉంటే.. టీడీపీ పుంజుకుంటే.. తిరిగి ఆయ‌న సైకిల్ ఎక్కి పోవ‌డం ఖాయ‌మ‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. స‌రే.. భ‌విష్య‌త్తు ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ఇప్ప‌టికైతే.. ఒకే ఒక్క నేత‌.. అటు చంద్ర‌బాబును, ఇటు జ‌గ‌న్‌ను రాజ‌కీయంగా ఇరుకున పెట్టేసి.. త‌న పంతం నెగ్గించుకునేందుకు ప్ర‌య‌త్నించడం ఆస‌క్తిగా మారింది.