Begin typing your search above and press return to search.

షాకిచ్చిన జగన్: కృష్ణపట్నం పోర్టుకు కత్తెర

By:  Tupaki Desk   |   31 Dec 2019 2:27 PM GMT
షాకిచ్చిన జగన్: కృష్ణపట్నం పోర్టుకు కత్తెర
X
చంద్రబాబు హయాంలో ఆయన ఏరికోరి కృష్ణం పట్నం పోర్టు నిర్మాణానికి చేయాల్సిన సాయం అంతా చేశారన్న విమర్శలున్నాయి. దాన్ని ఎవ్వరూ తాకకుండా.. దానికి పోటీలేకుండా జీవోలు ఇచ్చి రక్షణ చర్యలు చేపట్టారు. ఈ పోర్టు నిర్మాణంతో టీడీపీ పెద్దలు లాభపడ్డారని.. సమీప భూముల్లో రియల్ భూమ్ తో లబ్ధిపొందారని అప్పటి ప్రతిపక్ష వైసీపీ ఆరోపించింది.

అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ‘కృష్ణపట్నం పోర్టు’ అథారిటీకి షాకిచ్చింది. చంద్రబాబు కృష్ణపట్నం పోర్టు అథారిటీకి కల్పించిన అదనపు అధికారాలకు కత్తెర వేసింది.

చంద్రబాబు ప్రభుత్వం కృష్ణపట్నం పోర్టు కు అటూ ఇటూ 30 కిలోమీటర్ల దూరంలో మరో పోర్టు నిర్మాణానికి వీల్లేకుండా జీవో ఇచ్చింది. ఒకవేళ చేపట్టినా దాన్ని కృష్ణం పట్నం పోర్టుకే నిర్మాణ హక్కు బాధ్యతలు ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది.

ఈ అధికారాలతో కృష్ణం పట్నం పోర్టు అథారిటీ ప్రకాశం జిల్లా రామాయపట్నం లో చేపట్టిన పోర్టును నిర్మించడం లేదు. వైసీపీ ప్రభుత్వం రామాయపట్నం పోర్టును అభివృద్ధి చేయాలని చూసినా కృష్ణపట్నం పోర్టు పట్టించుకోలేదు. దీంతో చంద్రబాబు కల్పించిన అధికారాలకు జగన్ సర్కారు కత్తెర వేసింది. రామాయపట్నం పోర్టును నిర్మించడానికి మార్గం సుగమం చేసుకుంది. ఈ పరిణామం కృష్ణపట్నం పోర్టు అథారిటీకి షాకింగ్ లా మారింది.