Begin typing your search above and press return to search.
ధిశా సలియాన్ సూసైడ్ పై అథవాలే షాకింగ్ కామెంట్స్
By: Tupaki Desk | 26 Sept 2020 11:00 PM ISTసూసైడ్ మిస్టరీగా మొదలైన సుశాంత్ మృతి వ్యవహారం థ్రిల్లర్ సినిమాలో ఎన్నో మలుపులు తిరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా రియాను విచారణ జరిపిన సీబీఐ అధికారులు...డ్రగ్స్ కోణంలో విచారణకు బాటలు వేశారు. దీంతో, రంగంలోకి దిగిన ఎన్సీబీ ఇప్పటికే దీపికా పదుకొణే, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్ లను విచారణ జరిపింది. ఈ వ్యవహారంలో బాలీవుడ్ కు చెందిన మరింత మంది ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ కేసుపై కేంద్ర సామాజిక, సాధికార శాఖ సహాయ మంత్రి రామ్‌దాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ దగ్గర గతంలో పనిచేసి ఆత్మహత్య చేసుకున్న దిశా సలియాన్ మరణించడానికి కొద్ది రోజుల ముందు టార్చర్ కు గురైందని షాకింగ్ కామెంట్లు చేశారు. అందుకే, దిశా మృతిపై సీబీఐ దర్యాప్తు జరిగితేనే సుశాంత్ కేసుకు సరైన ముగింపు లభిస్తుందని చెప్పారు.
జూన్ 8న దిశా ఇంట్లో ఓ పార్టీ జరిగిందని, ఆ సమయంలో మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఆమె టార్చర్‌కు గురయ్యారన్న సమాచారం ఉందని అథవాలే అన్నారు. అందుకే, సుశాంత్ కేసుతోపాటు దిశ కేసుపై కూడా సీబీఐ విచారణ జరగాలని, అపుడే సుశాంత్ డెత్ కేసులో ఓ ముగింపునకు రాగలమని అన్నారు. కాగా, చాలాకాలం నుంచి దిశ ఆత్మహత్య పై కూడా పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. దిశకు సుశాంత్ బాసటగా ఉన్నాడని, దిశ ఆత్మహత్యకు సుశాంత్ సూసైడ్ కు లింక్ ఉందని సోషల్ మీడియాలో పుకార్లు వచ్చాయి. అందుకే, దిశ ఆత్మహత్య కేసుపైనా సీబీఐ విచారణ జరపాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. తాజాగా అదే అభిప్రాయాన్ని అథవాలే వ్యక్తపరచడంతో త్వరలోనే దిశ సూసైడ్ కేసుపైనా సీబీఐ విచారణ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.