Begin typing your search above and press return to search.
నోట్లపై అంబేద్కర్ బొమ్మ..మోడీ నిధికి పాత నోట్లు
By: Tupaki Desk | 30 Jan 2017 8:58 AM GMTకేంద్ర సామాజిక న్యాయశాఖా మంత్రి - రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రామ్ దాస్ అతవాలే ఆసక్తికరమైన డిమాండ్ చేశారు. కొత్త కరెన్సీ నోట్లపై బీఆర్ అంబేద్కర్ చిత్రాన్ని ముద్రించాలని ఆయన కోరారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే విధంగా రాజ్యంగ సవరణ చేయాలన్నారు. బెంగళూరులో జరుగుతున్న రెండు రోజుల పార్టీ జాతీయ సమావేశాల నేపథ్యంలో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి రామ్ దాస్ తెలిపారు. 'కరెన్నీ నోట్లపై అంబేద్కర్ వుండాలన్నది కేవలం దళితులు కోరిక మాత్రమే కాదు. యావత్తు ప్రజలందరూ కోరుకుంటున్నారు' అని మంత్రి అన్నారు. అప్పట్లో స్వాతంత్య్రోదమంలో విజయం సాధించిన నేపథ్యంలో మహాత్మ గాంధీ ఫోటో ముంద్రిచారని, ఇప్పడు మాత్రం అందరూ అంబేద్కర్ ఫోటో ఉండాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. కాగా, నోట్ల రద్దు నిర్ణయాన్ని మంత్రి సమర్థించారు. పేదరిక నిర్మూలన కోసమే మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. అంబేదర్కర్ కూడా అప్పట్లో 10 ఏళ్ల తరువాత నోట్ల రద్దు జరగాలని చెప్పారని అతవాలే గుర్తు చేశారు.
ఇదిలాఉండగా ప్రధానమంత్రి సహాయ నిధికి గుర్తు తెలియని వ్యక్తి నుంచి చెల్లని పాత నోట్ల రూపంలో రూ. 23,500 విరాళంగా అందింది. 11 వెయ్యి రూపాయల నోట్లు - మిగిలినవి అన్నీ రూ. 500 ఉన్న ప్యాకెట్ మౌలానా అజాద్ మెడికల్ కాలేజీ డీన్ కు పోస్టులో వచ్చింది. అవి చూసి ఆశ్చర్యపోయిన ఆయన ఆ పాత నోట్లను ఏం చేయాలో అర్థంకాక విజిలెన్స్ విభాగానికి చేరవేశారు. ఇప్పుడు విజిలెన్స్ విభాగం అధికారులు, అకౌంట్స్ విభాగం అధికారులను వాటి విషయమై తర్జనభర్జన పడుతున్నారు. బహుశా నగదు మార్చుకోవడం సాధ్యం కాక ఆ అజ్ఞాత వ్యక్తి ఇలా విరాళం రూపంలో వదిలించుకుని ఉంటాడని ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చారు. సహాయ నిధికి బదిలీ చేయటమా లేక బ్యాంకు ఖాతాకు జమ చేయటమా లేక పోలీసులకు అప్పగించాలా అనే విషయంపై వారు తీవ్రంగా సతమతమవుతున్నవరు. ఏది ఏమైనా ఈ నగదు విషయంలో అకౌంట్స్ విభాగం ఒకటి రెండు రోజుల్లో ఒక నిర్ణయానికి రానుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/