Begin typing your search above and press return to search.
నాకు ఎందుకు నోబెల్ ప్రైజ్ రాలేదంటే..
By: Tupaki Desk | 7 Nov 2015 5:51 PM GMTరాందేవ్ బాబా...దేశంలో యోగాను పాపులర్ చేసిన వారిలో ఈయనొకరు. ఎందరికో నోబెల్ పురస్కారాలు దక్కినప్పటికీ తనకు నోబెల్ ఎందుకు రాలేదో తాజాగా ఆయన వెల్లడించారు. రాంచీలో జరిగిన ఓ యోగా కార్యక్రమంలో రాందేవ్ బాబా మాట్లాడుతూ తన శరీర తత్వం వల్లే నోబెల్ దక్కలేదని తేల్చారు.
"నాకే గనక మరింత మంచి, మెరుగైన రంగు ఉండి ఉంటే...నాకు నోబెల్ బహుమతి దక్కేది. యోగాలో ఇంత పట్టు సాధించి ఇంతగా పాపులర్ చేసినప్పటికీ నాకు ఎందుకు నోబెల్ రాలేదంటే కలర్ కంటే వేరే కారణమేది లేదు" అని చెప్పారు. రాంచీలో జరిగిన ఈ కార్యక్రమాన్ని తెలుగు చానల్ ఈటీవీ ప్రపంచానికి చాటిచెప్పింది. ఈ వ్యాఖ్యలను సాక్షాత్తు జార్ఖండ్ ముఖ్యమంత్రి సమక్షంలో చేయడం ఆసక్తికరం.
అయితే రాందేవ్ బాబా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చెణుకులు, విమర్శలు వెల్లువెత్తాయి. "రాందేవ్ బాబాకు నోబెల్ బహుమతే ఇవ్వాలనే ఏముంది? ఆ బహుమతిని తిరస్కరిస్తూ పతంజలి పురస్కారం పేరుతో కొత్త పురస్కారం సృష్టించుకోవచ్చు కదా?" అంటూ ఒకరు సెటైర్ వేశారు. " రాందేవ్ బాబా గత 30 ఏళ్లుగా గడ్డం గీసుకోలేదు. అలా పెరిగిపోయిన వెంట్రుకలే ఒళ్లంతా కూడా పెరిగిపోయాయని ఆయన అనుకుంటున్నట్లుంది" అని మరొకరు పంచ్ వేశారు. "ఇదంతా ఎందుకు? రాందేవ్ బాబానే కొత్త ఫెయిర్‌నెస్ క్రీంను కనుక్కొని రంగు మార్చుకుంటే నోబెల్ బహుమతి ఆయన వద్దకు వస్తుంది" అని మరొకరు చురక అంటించారు.