Begin typing your search above and press return to search.
ప్రియాంకా గాంధీకి ఊహించని ప్రశంసలు
By: Tupaki Desk | 29 April 2016 7:33 AM GMTహార్డుకోర్ బీజేపీ అభిమాని ఒకరి నుంచి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకకు ఊహించని రీతిలో ప్రశంసలు వచ్చాయి. ప్రియాంకను ప్రశంసించిన వ్యక్తి ఇంకెవరో కాదు, యోగా గురు బాబా రాందేవ్. కాంగ్రెస్ పేరెత్తితే విరుచుకుపడే రాందేవ్ ఎవరూ ఊహించని రీతిలో ప్రియాంక గాంధీకి మంచి సర్టిఫికెట్ ఇచ్చారు. ప్రియాంకలో భారతీయత కనిపిస్తుందని ఆయన కితాబిచ్చారు. అయితే... అదే సమయంలో ప్రియాంక సోదరుడు - కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని మాత్రం రాందేవ్ వేస్టని తేల్చేశారు. రాహుల్ కు చాలా అవకాశాలు వచ్చాయని ఆయన ఏమాత్రం ఉపయోగించుకోలేకపోయారని అన్నారు.
రీసెంటుగా ఓ ఛానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బాబా రాందేవ్ పలు ఆసక్తికర అంశాలు చెప్పారు. 2014 సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ఆరు నెలల ముందే తాను బీజేపీ విజయాన్ని ఊహించి చెప్పానని... తన మాట నిజమైందని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పడమే కాకుండా మోడీ నాయకత్వంలో 300కు పైగా స్థానాలు గెలుచుకుంటారని కూడా తాను ముందుగానే చెప్పానని రాందేవ్ చెప్పారు.
రాహుల్ గాంధీ విషయంపైనా మాట్లాడిన ఆయన రాహుల్ లోని లోపాలను చెబుతూ ఆయన ప్రతిపక్ష నేతగా మరింత ధృఢంగా ఉంటే తప్ప రాణించలేరని అన్నారు. రాహుల్ బలపడితే బలమైన ప్రతిపక్షం ఉంటుందని... ప్రజాస్వామ్యంలో బలమైన విపక్షం ఉంటే మంచిదేనని అన్నారు. రాహుల్ ఆ విషయంలో అట్టర్ ప్లాఫయ్యారని రాందేవ్ అభిప్రాయపడ్డారు.