Begin typing your search above and press return to search.
పాక్ దవడ పగలకొట్టమంటున్నాడు
By: Tupaki Desk | 20 Sep 2016 4:26 AM GMTయోగా గురువు యోగా మాత్రమే చెప్పటం కనిపిస్తుంది. వ్యాపారస్తుడు వ్యాపారం మాత్రమే చేయటం మామూలే. కానీ.. యోగాను.. వ్యాపారాన్ని మిక్స్చేసి సూపర్ హిట్ చేసే సత్తా బాబా రాందేవ్ లాంటి వారికి మాత్రమే సాధ్యమవతుందేమో. తమకున్న వ్యాపారాల నేపథ్యంలో పరిమితంగా మాట్లాడే లక్షణాన్ని బాబా రాందేవ్ అస్సలు పట్టించుకోరు. ఆయన ‘పతంజటి’ బ్రాండ్ భారత్ లోనే కాదు పలు దేశాల్లోనూ అమ్ముతున్నారు. అలా అమ్ముతున్న దేశాల్లో దాయాది పాకిస్థాన్ ఒకటి. తన వ్యాపార ప్రయోజనాల్ని నష్టపోయేలా మాట్లాడటానికి పెద్దగా ఇష్టపడని మిగిలిన పారిశ్రామికవేత్తలకు భిన్నంగా తాజాగా బాబా రాందేవ్ రియాక్ట్ అయ్యారు.
తన పతంజలి బ్రాండ్ పాక్ లో అమ్ముతున్న బాబా రాందేవ్.. తాజాగా ఆ దేశంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఊరి సైనిక శిబిరంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు తెగబడటం.. ఈ దుర్మార్గపు ఘటనలో 20 మంది సైనికులు వీరమరణం పొందటం దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అత్యంత పాశవికంగా జరిపిన ఉగ్రదాడిపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది.
వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా వివిధ వర్గాలకు చెందిన పలువురు ప్రముఖులు మాత్రం ఈ అంశంపై పెద్దగా స్పందించని వైనం కనిపిస్తుంది. దీనికి భిన్నంగా బాబా రాందేవ్ తాజాగా రియాక్ట్ అయ్యారు. భారత సైనికులు 20మంది చనిపోయిన ఘటనపై సీరియస్ అయిన రాందేవ్ బాబా.. యుద్ధం పరిష్కారం కానప్పటికీ.. పాక్ దవడ పగిలేలా కొట్టాల్సిన అవసరం ఉందన్నఅభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఊరి లాంటి ఘటనలు మళ్లీ ఎదురుకాకుండా ఉండాలంటే.. పాక్ ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిందేనని చెప్పారు. ‘‘ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిందే. పాక్ దవడ పగలకొట్టేలా సమాధానం చెప్పాలి. దీంతో పాటు పాక్ ప్రేరిత ఉగ్రవాదుల దవడలు నిజంగా పగలకొట్టాల్సిన అవసరం ఉంది’’ అని చెప్పారు. తన వ్యాపార ప్రయోజనాల్ని లైట్ గా తీసుకుంటూ.. దాయాదిపై ఈ స్థాయిలో విరుచుకుపడటం గమనార్హం.