Begin typing your search above and press return to search.
ఏపీ మంత్రులకు మళ్లీ భంచిక్ భంచిక్
By: Tupaki Desk | 4 March 2016 7:14 AM GMT ఏపీలో మంత్రులు, అధికారులు అందరికీ మరోసారి యోగా క్లాసులు నిర్వహిస్తారట. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈసారి ప్రముఖ యోగా గురువు, పతంజలి బ్రాండ్ బాబా రామ్‌దేవ్ మన మంత్రులు, అధికారులతో యోగాసనాలు వేయిస్తారు. బడ్జెట్ సమావేశాల సమయంలోనే ఒక రోజు ఈ తరగతులు జరగనున్నాయి.
నిజానికి ఈ యోగా తరగతులను 12వ తేదీన నిర్వహించాలని తొలుత అనుకున్నారు. అయితే... ఆ రోజు ముఖ్యమంత్రి లండన్ పర్యటనలో ఉంటారని... కాబట్టి ఇంకోరోజు ఈ తరగతులు నిర్వహిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాగా గతంలోనూ ఓమారు జగ్గీ వాసుదేవ్ తో ఏపీ మంత్రులు, ఉన్నతాధికారులకు మూడు రోజుల పాటు క్లాసులు చెప్పించారు. మళ్లీ ఇప్పుడు యోగా గురు బాబా రాందేవ్ తో యోగా క్లాసులు నిర్వహిస్తున్నారు. అప్పట్లో మూడు రోజుల పాటు ఈ తరగతులు నిర్వహించడంతో సెక్రటేరియట్ లో అధికారులు అందుబాటులో లేక విమర్శలు వచ్చాయి. ఆ నేపథ్యంలో ఈసారి తరగతులను బాగా కుదించారు. కేవలం ఒక్క రోజుకే పరిమితం చేశారు. అందులోనూ బడ్జెట్ సమావేశాల సమయంలోనే నిర్వహిస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా అందుబాటులో ఉంటారు కాబట్టి ఆసక్తి ఉన్న ఎవరైనా రావొచ్చని అంటున్నారు.