Begin typing your search above and press return to search.

అల్లోపతిపై రామ్ దేవ్ కామెంట్.. ఐఏంఏ ఆగ్రహం

By:  Tupaki Desk   |   23 May 2021 7:07 AM GMT
అల్లోపతిపై రామ్ దేవ్ కామెంట్..  ఐఏంఏ ఆగ్రహం
X
ప్రముఖ యోగా గురువు, పతంజలి వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అల్లోపతి మందుల వల్ల చాలా మంది చనిపోతున్నారని యోగా గురువు బాబా రామ్‌దేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అల్లోపతి ఒక తెలివితక్కువ శాస్త్రం అని మండిపడ్డారు. బాబా రామ్‌దేవ్ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది అల్లోపతి వైద్యుల మనోభావాలను దెబ్బతీసింది. దీంతో దేశంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) మండిపడింది. తమ వైద్యశాస్త్రాన్ని అవమానించిన యోగా గురువు రాందేవ్ బాబాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.

డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) ఆమోదించిన రెమ్‌డెసివిర్, ఫాబిఫ్లు మరియు అన్ని ఇతర మందులు కోవిడ్ -19 చికిత్సలో విఫలమయ్యాయి. ఫాబిఫ్లూ వంటి జ్వరం తగ్గడానికి రోగులకు ఇస్తున్న మందులు వారికి ఏ మాత్రం మంచి చేయవు ”అని బాబా రామ్‌దేవ్ ఆరోపించారు..

యోగా గురువు వ్యాఖ్యలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) తీవ్రంగా స్పందించింది. బాబా రామ్‌దేవ్‌పై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఒకవేళ ఆరోగ్య మంత్రిత్వ శాఖ విఫలమైతే, బేషరతుగా క్షమాపణ చెప్పడానికి బాబా రామ్‌దేవ్‌ను కోర్టుకు లాగుతామని ఐఎంఎ బెదిరించింది.

"భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 188 తో ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్ యొక్క సెక్షన్ 3 కింద, రామ్‌దేవ్ అల్లోపతి వైద్యులను అవమానించారు. చాలా మంది జీవితాలను ప్రమాదానికి గురిచేశారని ఆరోపించారు. వైద్యులపై నమ్మకం కోల్పోయేలా చేశాడు. అల్లోపతి మందుల సలహాలను తీసుకోకుండా కుట్ర చేస్తున్నాడు. ఆయనపై విచారణ జరిపించాలి" ఐఏంఏ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇంతలో ఈ వీడియో చూసిన నెటిజన్లు బాబా రామ్‌దేవ్‌పై సెటైర్లు, మీమ్స్ తో ఎండగడుతున్నారు. అల్లోపతి తెలివితక్కువ శాస్త్రమన్న యోగా గురువు విశ్వసిస్తే అప్పట్లో ఏనుగు నుంచి పడిపోయి స్వల్ప గాయాలైన రాందేవ్ కార్పొరేట్ ఆసుపత్రిలో ఎందుకు చేరాడు అని ఒక నెటిజన్ ఘాటుగా ప్రశ్నించారు. యోగా గురువు ట్రోల్స్ తో ఇప్పుడు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. అతడు చేసిన వ్యాఖ్యలపై భారీగా కౌంటర్లు పడుతున్నాయి.