Begin typing your search above and press return to search.
అసద్ కోసమే అంత మాట అన్నాడట
By: Tupaki Desk | 27 April 2016 5:16 AM GMTదూకుడు రాజకీయాలు పెరిగిన తర్వాత ఎవరికి వారు ఇష్టారాజ్యంగా మాట్లాటం.. వ్యాఖ్యలు చేయటం ఒక అలవాటుగా మారిన సంగతి తెలిసిందే. తన గొంతు మీద కత్తి పెట్టినా.. ‘‘భారత్ మాతా కీ జై’’ అనే మాటను అననంటూ మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్య చేయటం.. దానికి ప్రతిగా చాలామంది చాలానే మాటలు మాట్లాడటం తెలిసిందే. అయితే.. ఇలా మాట్లాడిన మాటల్లో అందరికి గుర్తు ఉండిపోయే మాట మాత్రం ప్రఖ్యాత యోగా గురువు రాందేవ్ బాబాదే.
భారత్ మాతాకీ జై అంటూ నినాదం చేయని లక్షల మంది తలలు నరకటానికైనా తాను వెనుకాడనని.. కాకుంటే చట్టసమ్మతం కాదు కాబట్టే తాను అలాంటిదేమీ చేయనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇదిలా ఉంటే.. తాజాగా తాను ఎప్పుడో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రాందేవ్ బాబా తాజాగా స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలు కేవలం ఎంపీ అసద్ ను ఉద్దేశించి చేసినవే తప్పించి.. తాను శాంతమూర్తినని చెప్పుకున్నారు.
తాను అహింసావాదినని. అంతా కలసి మెలిసి ఉండాలని తాను కోరుకుంటానని చెప్పిన రాందేవ్ బాబా.. ‘‘నా తల నరికేయండి.. అయినా సరే నేను ఖురాన్.. బైబిల్ ను గౌరవించనని అనటం తప్పు. నా మతం మీద విశ్వాసం ఉన్నంత మాత్రాన ఇతరుల నమ్మకాలను కించపరిచేందుకు లైసెన్స్ వచ్చినట్లు కాదు’’ అని చెప్పుకొచ్చారు. తనను చూసి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. అసద్ రెచ్చగొట్టేలా మాట్లాడటంతో తాను అలాంటి వ్యాఖ్యలు చేసినట్లుగా చెప్పుకొచ్చారు. రెచ్చగొడితే రెచ్చిపోయే పెద్దమనిషి తానో పెద్ద శాంతమూర్తినని చెప్పుకోవటంలో అర్థం ఉందా? ఒక మూర్ఖపు నేత మూర్ఖంగా మాట్లాడితే అదే స్థాయిలో మాట్లాడటం ఏమిటో రాందేవ్ బాబాకే అర్థం కావాలి.