Begin typing your search above and press return to search.
రామ్‌దేవ్ బాబా సంచలనం: వైరస్‌కు మందు ఆవిష్కరణ
By: Tupaki Desk | 11 Jun 2020 3:30 PM GMTమహమ్మారి వైరస్‌కు అన్ని వైద్యశాస్త్రాల్లో నివారణ మందు కనిపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పరిశోధన సంస్థలు, వైద్య విజ్ఞాన సంస్థలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. వాటిలోనే తాజాగా ఆయుర్వేదంలో వైరస్ నివారణకు మందు ఆవిష్కరిస్తున్నట్లు యోగా గురువు, పతాంజలి సంస్థ అధినేత బాబా రామ్‌దేవ్ ప్రకటించారు. వైరస్‌ను అంతమొందించే వ్యాక్సిన్ సిద్ధంగా ఉందని బాబా రామ్‌దేవ్ సంచలన ప్రకటన చేయడంతో కొంత ఆనందించే విషయం.
ఈ వ్యాధి నుంచి కోలుకునేందుకు మందు సిద్ధంగా ఉందని యోగాగురు, పతంజలి వ్యవస్థాపకుడు బాబా రామ్‌దేవ్ గురువారం ప్రకటించారు. ప్రాణాంతక వైరస్‌కు విరుగుడు తమ వద్ద ఉందని తెలిపారు. గిలోయ్ , అశ్వగంధ కాంబినేషన్‌తో ఈ వైరస్‌కు చికిత్స చేయవచ్చునని రామ్ దేవ్ బాబా తెలిపారు. ఆ వైరస్ మన శరీరంలోకి చొచ్చుకుపోయి మొత్తం కణాలు, వ్యవస్థను నాశనం చేస్తుందని, శరీరంలోని ఇతర కణాలకు సోకుతుందని వివరించారు. వాటిని అశ్వగంధ, గిలోయ్ విచ్ఛినం చేసి తొలగిస్తాయని తెలిపారు. అశ్వగంధ, గిలోయ్ శరీరం లోపల సంక్రమణ గొలుసును విచ్ఛిన్నం చేయడంలో తీవ్ర ప్రభావమంతంగా పని చేస్తాయని వెల్లడించారు. వైరస్ బాధితులకు గిలోయ్, అశ్వగంధ, తులశివతి ఖాళీ కడుపుతో, భోజనం అనంతరం కూడా ఇచ్చామని చెప్పారు. ఆ మందు ఇచ్చిన తర్వాత సత్ఫలితం కనిపించిందని, వంద శాతం రికవరీ, జీరో శాతం మరణ రేటు ఉందని మీడియాకు తెలిపారు. ప్రస్తుతం ఆ మందులపై క్లినికల్ కంట్రోల్ ట్రయల్ జరుగుతోందని చెప్పారు. త్వరలో అందుబాటులోకి తీసకువస్తామని రామ్ దేవ్ బాబా తెలిపారు. ఆయుర్వేదం మందు వైరస్‌కు విరుగుడుగా పని చేస్తుందని తెలియడంతో ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్నారు.