Begin typing your search above and press return to search.
హైకోర్టులో పోతినేని రమేశ్ బాబు ముందస్తు బెయిల్ పిటీషన్
By: Tupaki Desk | 17 Aug 2020 12:10 PM GMTవిజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంటర్ లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో 10మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రమేష్ హాస్పిటల్స్‌కు చెందిన ముగ్గురు సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు సోమవారం ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టులో దాఖలు చేశారు.
ఇప్పటికే పరారీలో ఉన్న రమేష్ బాబును పట్టుకోవడానికి ఎనిమిది ప్రత్యేక బృందాలను పోలీసులు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. స్వర్ణ ప్యాలెస్ యజమాని ముత్తవరపు శ్రీనివాస్ రావు కోసం కూడా పోలీసులు వెతుకుతున్నారు.ఇప్పటికే దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలని సిఆర్‌పిసి సెక్షన్ 160 కింద పోలీసులు రమేష్ బాబు, శ్రీనివాస్ రావులకు నోటీసులు ఇచ్చారు.
అగ్నిప్రమాదానికి కారణమైనందున రమేష్ హాస్పిటల్ లైసెన్స్ ను కూడా కృష్ణ జిల్లా కలెక్టర్ రద్దు చేశారు. కాగా ఈ ప్రమాదంపై స్పందించిన టాలీవుడ్ హీరో రామ్ వ్యాఖ్యలను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. 90 సిఆర్‌పిసి కింద పోతినేని రమేష్ బాబు సోదరుడి కుమారుడైన హీరో రామ్ పోతినేనికి పోలీసులు నోటీసులు అందిస్తారని, రమేష్ ఆసుపత్రి సమస్యను తీవ్రంగా పరిగణిస్తున్నారని విజయవాడ ఎసిపి సూర్యచంద్రరావు స్పష్టం చేశారు. సోషియా మీడియాలో వ్యతిరేకించిన హీరో రామ్ కు ఏదైనా ఆధారాలు ఉంటే అతను పోలీసుల ముందు హాజరుపరచాలి” అని ఏసీపీ స్పష్టం చేశారు.
ఈ అగ్నిప్రమాద ఘటనలో ఇప్పటికే విజయవాడ సౌత్ జోన్ పోలీసులు డాక్టర్ మమతాతోపాటు పరారీలో ఉన్న కుటుంబ సభ్యులు సహా మరో 9 మందికి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు.