Begin typing your search above and press return to search.

సీఎం వ‌ర్సెస్ హోం మినిస్ట‌ర్‌

By:  Tupaki Desk   |   28 Dec 2015 11:56 AM GMT
సీఎం వ‌ర్సెస్ హోం మినిస్ట‌ర్‌
X
ప్రభుత్వం పనితీరు స‌రిగా లేక‌పోతే విప‌క్షాలు సీఎంపై గ‌వ‌ర్న‌ర్‌ కు - ఇత‌ర కేంద్ర‌మంత్రుల‌కు ఫిర్యాదు చేయ‌డం సాధార‌ణ‌మే. మంత్రి వ‌ర్గంలో అయినా.. అధికార పార్టీలో ఏ చిన్న నేత అయినా త‌ప్పు చేసినా.. దానికి పూర్తి బాధ్యత‌ ముఖ్యమంత్రి వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రాంతీయంగా ఉండే పార్టీల్లో ముఖ్య‌మంత్రే సుప్రీం కాబ‌ట్టి.. ఇక ఎవ‌రూ ఆయ‌నను వేలెత్తి చూపించే సాహ‌సం చేయ‌రు. కానీ జాతీయ పార్టీ అయితే మాత్రం అలా ఉండ‌దు. అంద‌రికీ పై స్థాయి నాయ‌కుల‌తో సంబంధాలు క‌లిగి ఉండ‌డంతో ఎవరు ఎవ‌రిమీదైనా ఫిర్యాదు చేసే అవ‌కాశ‌ముంది. ఇప్పుడు కేర‌ళ సీఎంపై ఆ రాష్ట్ర హోం మంత్రే అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ విష‌యం ఇప్పుడు కేర‌ళ పొలిటిక‌ల్ వ‌ర్గాల్లో పెద్ద హాట్ టాపిక్‌ గా మారింది.

కేరళలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ పై ఆ రాష్ట్ర హోం మంత్రి రమేష్ చెన్నితల కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారని ప్రచారం జరుగుతోంది.కేరళ ప్రభుత్వ పనితీరుపై, స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పరాజయంపై, రాష్ర్టంలో బీజేపీ బ‌ల‌ప‌డుతున్న తీరుపై అందులో తన అభిప్రాయాలు తెలియచేశారని స‌మాచారం. ప్రభుత్వ తీరు బాగోలేదని చెన్నితల రాసిన లేఖపై ముఖ్యమంత్రి చాందీని మీడియా ప్రశ్నిస్తే, `ప్రభుత్వ పనితీరును అంచనా వేయవలసింది, న్యాయాన్యాయాలను నిర్ణయించవలసింది ప్రజలు కానీ, ఒక వ్యక్తి కాద`ని ఆయ‌న వ్య‌గ్యంగా వ్యాఖ్యానించారు. అయితే తాను చెన్నితల ఏమి లేఖ రాశాడో చూడలేదని, పైగా ఆయ‌న కూడా త‌న‌పైన ఎలాంటి లేఖ రాయలేదని అంటున్నాడని, కేవలం టీవీలలో వచ్చిన వార్తల ఆదారంగా విచారణ చేయలేం కదా అని స‌రిపెట్టారు. దీనిని బట్టి చూస్తే ముఖ్యమంత్రి పై హోం మంత్రి అధిష్టానానికి ఫిర్యాదు చేసిన విష‌యం వాస్త‌వ‌మే అన్న చ‌ర్చ ఇప్పుడు కేర‌ళ‌లో జోరుగా జ‌రుగుతోంది. ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా ప్ర‌భ కోల్పోయి అనేక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న కాంగ్రెస్‌కు ఇప్పుడు ఇదే పెద్ద త‌ల‌నొప్పిగా మారింది.