Begin typing your search above and press return to search.
జైపాల్ రెడ్డి పాడె మోసిన కర్ణాటక మాజీ సీఎం - మాజీ స్పీకర్!
By: Tupaki Desk | 29 July 2019 5:19 PM GMTకాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి అంత్యక్రియలకు జాతీయ నేతలు - పొరుగు రాష్ట్రాల నేతలు తరలివచ్చారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం గాంధీభవన్ నుంచి నెక్లెస్ రోడ్డువరకు సాగిన జైపాల్ రెడ్డి అంతిమయాత్రకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.
కర్ణాటక అసెంబ్లీలో నేడు సీఎం యుడియూరప్ప విశ్వాస పరీక్ష ముగిసిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య - రాజీనామా చేసిన స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ లు హైదరాబాద్ కు చేరుకున్నారు. సిద్ధరామయ్య - రమేశ్ కుమార్ లు జైపాల్ రెడ్డి పాడె మోశారు. జైపాల్ రెడ్డి భౌతికకాయాన్ని చూడగానే రమేశ్ కుమార్ కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం పీవీ ఘాట్ సమీపంలో అంత్యక్రియల్లో పాల్గొని జైపాల్ రెడ్డి పాడెను స్వయంగా మోశారు. అంత్యక్రియులు సాగుతున్నంతసేపు రమేశ్ కుమార్ విలపిస్తూనే ఉన్నారు.
బెంగళూరులో నిన్న మీడియా సమావేశం సందర్భంగా జైపాల్ రెడ్డి చనిపోయారని రమేశ్ కుమార్ కు తెలిసింది. దీంతో తీవ్ర భావోద్వేగానికి లోనైన ఆయన.. జైపాల్ తో తనది 40 ఏళ్ల అనుబంధమని తెలిపారు. జైపాల్ రెడ్డి తనకు పెద్దన్నలాంటి వారనీ - తనకు మార్గదర్శిగా వ్యవహరించారని అప్పుడే చెప్పారు.
నిన్న 14 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ హోదాలో అనర్హత వేటు వేసిన రమేశ్ కుమార్ ఈరోజు ఉదయం తన స్పీకర్ పదవికి రాజీనామా చేశారు. అనంతరం ప్రత్యేక విమానంలో జైపాల్ రెడ్డి అంత్యక్రియలకు హాజరయ్యారు. మరోవైపు సిద్ధరామయ్య కూడా మాజీ ముఖ్యమంత్రినన్న భావమే లేకుండా జైపాల్ రెడ్డి పాడె మోశారు. జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు.అంత్యక్రియలు పూర్తయ్యేవరకు సిద్ధరామయ్య - రమేశ్ కుమార్ లు అక్కడే ఉన్నారు.