Begin typing your search above and press return to search.

ప‌రీక్షల‌ క‌న్నా ప్రాణం ముఖ్యం: నీట్‌ - జేఈఈ ప‌రీక్ష‌లు కూడా వాయిదా

By:  Tupaki Desk   |   3 July 2020 3:58 PM GMT
ప‌రీక్షల‌ క‌న్నా ప్రాణం ముఖ్యం: నీట్‌ - జేఈఈ ప‌రీక్ష‌లు కూడా వాయిదా
X
మ‌హ‌మ్మారి వైర‌స్ విజృంభ‌ణ దేశంలో ఇంకా తీవ్ర‌స్థాయిలో ఉంది. ఈ ప‌రిస్థితుల్లో సామూహిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం క‌ష్ట‌సాధ్యంగా ఉంది. ఒక‌వేళ నిర్వ‌హించ‌డానికి సాహసిస్తే పెద్ద ఎత్తున వైర‌స్ కేసులు పెరిగే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలోనే విద్యా సంవ‌త్స‌రం గాడీ త‌ప్పింది. రాష్ట్రాల్లో విద్యా సంవ‌త్స‌రం దెబ్బ‌తిన‌గా ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా విద్యా క్యాలెండ‌ర్ క్ర‌మం త‌ప్పింది. ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్‌, ప్ర‌వేశ ప‌రీక్ష‌లు త‌దిత‌ర వంటివి ర‌ద్ద‌వ‌డం.. వాయిదా ప‌డ‌డం చూసే ఉన్నాం. తాజాగా నీట్‌, జేఈఈ ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ్డాయి.

అంద‌రూ భావించిన‌ట్టుగానే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్ ‌(జేఈఈ) మెయిన్స్‌, నేషనల్‌ ఎలిజబిలిటీ కం ఎంట్రన్స్‌ టెస్ట్ (నీట్‌)ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ్డాయి. విద్యార్థుల భద్రత, విద్య రెండూ ముఖ్యంగా భావించి ఈ పరీక్షలను సెప్టెంబర‌కు వాయిదా వేస్తున్న‌ట్లు కేంద్ర మానవ వనరుల శాఖ‌ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ ప్రకటించారు. జేఈఈ అడ్వాన్స్‌ను కూడా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. నిపుణుల బృందం సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్ప‌ష్టం చేశారు.

ఈ క్ర‌మంలో నీట్‌ పరీక్ష సెప్టెంబర్‌ 13వ తేదీకి వాయిదా వేయ‌గా, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష సెప్టెంబర్‌ 27వ తేదీకి వాయిదా వేశారు. సెప్టెంబర్‌ 1 నుంచి 6వ తేదీ వరకు జేఈఈ మెయిన్స్‌ పరీక్షలను నిర్వహించనున్నారు.