Begin typing your search above and press return to search.
హ్యాపీ మూడ్ లో రాజీనామాతో సేనకు షాకిచ్చాడు
By: Tupaki Desk | 28 Nov 2019 5:48 AM GMTకలలో కూడా ఊహించని అద్భుతం సాకారమైంది. అంచనాలకు భిన్నంగా.. ఎప్పుడూ అనుకోని విధంగా శివసేనతో ఎన్సీపీ.. కాంగ్రెస్ లు జత కట్టటమే కాదు.. ప్రభుత్వాన్ని మరికొద్ది గంటల్లో ఏర్పాటు చేయనున్నారు. సేన తొలిసారి అధికారపక్షంగా అవిర్భవించటమే కాదు.. ఠాక్రే కుటుంబానికి చెందిన వ్యక్తి ఏకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి కానున్నారు. బీజేపీ పరివారం వేసిన ఎత్తుల్ని చిత్తు చేస్తూ.. మోడీషాలకు షాకులిస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న వేళ.. శివసేనకు చెందిన నేత ఒకరు షాకిచ్చిన వైనం సంచలనంగా మారింది.
శివసేన విద్యార్థి విభాగం జాతీయ విద్యార్థి సేనలో కీలకంగా వ్యవహరించే రమేష్ సోలంకి తన పదవికి రాజీనామా చేశారు. సిద్దాంతాల్ని పక్కన పెట్టి కాంగ్రెస్ తో కలిసి పని చేయటానికి తన మనసు ఒప్పుకోవటం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కారణంతోనే తాను శివసేన నుంచి తప్పుకుంటున్నట్లుగా పేర్కొన్నారు.
తానెప్పటికి బాలాసాహెబ్ శివసైనిక్ గా మిగిలిపోతానని పేర్కొన్న రమేశ్.. సిద్ధాంతాల్ని పక్కన పెట్టి కాంగ్రెస్ తో కలిసి పని చేయటాన్ని తాను తట్టుకోలేకపోతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొన్న వేళ పార్టీకి చెందిన నేత ఒకరు రాజీనామా చేయటం శివసేన అగ్రనాయకత్వానికి మింగుడుపడటం లేదంటున్నారు.