Begin typing your search above and press return to search.
తాత మాట కోసం మ్యాంగో ఫీస్ట్ చేస్తున్న మనమడు!
By: Tupaki Desk | 22 Jun 2019 6:43 AM GMTఇచ్చిన మాట కోసం నిలబడే వాళ్లు ఈ రోజుల్లోనూ ఉన్నారన్న విషయం తాజా ఉదంతాన్ని చూస్తే అర్థమవుతుంది. ప్రతిది వ్యాపార కోణంలో చూస్తున్న వేళ.. అప్పుడెప్పుడో తన తాతకు ఇచ్చిన మాట కోసం మనమడు పడుతున్న అతృత చూస్తే వావ్ అనాల్సిందే. ప్రతి ఏటా ఈ మనమడు చేసే ప్రయత్నం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ ఈ ఆసక్తికర ఉదంతం ఎక్కడ జరుగుతుందంటే..
మధ్యప్రదేశ్ కు చెందిన షాహ్ పూర్ పరిధిలోని చూడియా గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రామ్ కిషన్ యాదవ్ తన తోటలో పండే మామిడి పండ్లను ఉచితంగా పంపిణీ చేస్తుంటారు. సాధారణంగా మామిడి పండ్లను ఎవరైనా హోల్ సేల్ గా అమ్మేయటం.. తోటను లీజుకు ఇవ్వటం చేస్తారు. కానీ.. కిషన్ యాదవ్ మాత్రం అందుకు భిన్నం.
ప్రతి ఏడాది ఆయన మ్యాంగో పార్టీ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్నిఏర్పాటు చేస్తారు. అందరికి మామిడి పండ్లను అందిస్తారు. ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని మామిడి పండ్లను ఇస్తారు. ఆసక్తికరమైన విషయం మరొకటి ఏమంటే.. ఈ మామిడి పార్టీకి రాజకీయ నేతలు.. సామాజిక కార్యకర్తలు మొదలు సామాన్యుల వరకూ ఎంతోమంది హాజరవుతారు.
వీరంతా ఒక్క చోట కూర్చొని మామిడి పండ్లను తింటారు. మూడు ఎకరాల విస్తీర్ణంలో మామిడి పంటను పండించే రామ్ కిషన్ ఇదంతా ఎందుకు చేస్తున్నారో తెలుసా? తన తాతకు ఇచ్చిన మాట కోసమేనట. అంతేకాదు.. పార్టీతో పాటు.. ఎవరికైనా తన తోటలోని మామిడిపండ్లను ఫ్రీగా ఇచ్చేయటం అతనికో అలవాటు. బాగుంది కదూ!