Begin typing your search above and press return to search.
మోడీ దగ్గర ఎన్టీవోడికి భారతరత్న లెటర్
By: Tupaki Desk | 26 May 2017 12:10 PM GMTఅన్ని అర్హతలు ఉన్నా కొందరికి ఎలాంటి గౌరవం దక్కదు. అలాంటి వ్యక్తే తెలుగువారి ముద్దుబిడ్డ అన్న ఎన్టీవోడు. సినిమా నటుడిగా అశేష ప్రజాదరణను పొందినా ఆయనకు ప్రేక్షకుల రివార్డులు వచ్చాయే కానీ ప్రతిష్ఠాత్మక అవార్డులు వచ్చింది లేదు. రాజకీయాల్లోకి ఆయన ఎంట్రీ పుణ్యమా అని.. దరిద్రపుగొట్టు రాజకీయాలతో ఆయనకు దక్కాల్సిన గౌరవ మర్యాదలేవీ దక్కలేదు.
ఇక.. కంప్యూటర్ దగ్గర నుంచి సత్యనాదెళ్ల వరకూ అందరిని తానే తయారు చేసినట్లుగా చెప్పే చంద్రబాబు.. తాను ఢిల్లీలో చక్రం తిప్పగలనని తరచూ చెప్పేస్తుంటారు. మరి.. అలాంటి వ్యక్తి.. తన సొంత మామ.. పార్టీ వ్యవస్థాపకుడు.. ఈ రోజుకూ ఎన్టీవోడు బొమ్మ పెట్టుకొని ప్రజల ముందుకు వచ్చే ఆయనకు భారతరత్న ఎందుకు ఇప్పించలేకపోయారన్న ప్రశ్నకు సమాధానం అస్సలు దొరకదు.
ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారం వచ్చేలా చేస్తానని చెప్పే చంద్రబాబు మాటలకే పరిమితం అయ్యారే తప్పించి.. చేతల్లో ఏమీ జరగలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. తాజాగా శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్రానికి ఒక లేఖ రాశారు.
తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కోరుతూ లేఖ రాశారు. అయితే.. భారతరత్న పురస్కారం ఎవరికి ఇవ్వాలన్నది రాష్ట్రపతికి సిఫార్సు చేస్తారని చెప్పుకొచ్చారు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు. రామ్మోహన్ నాయుడు రాసిన లేఖను పీఎంవోకి పంపినట్లుగా చెప్పిన ఆయన.. లేఖను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఎన్టీవోడికి భారతరత్న పురస్కారం ముచ్చట పీఎం పేషీ దాకా వెళ్లింది. మరి.. తెలుగువారు సంతోషపడే నిర్ణయాన్ని మోడీ తీసుకుంటారా?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/