Begin typing your search above and press return to search.

‘కోవిందు’డు అందరి వాడేలే..

By:  Tupaki Desk   |   20 July 2017 11:22 AM GMT
‘కోవిందు’డు అందరి వాడేలే..
X
భారత 14వ రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ ఎన్నికయ్యారు. విపక్షాల అభ్యర్థి మీరాకుమార్ పై ఆయన భారీ తేడాతో గెలిచారు. 65.65శాతం ఓట్లను కోవింద్ గెలుచుకోగా యూపీయే అభ్యర్థి మీరాకుమార్ కు 34.35 శాట్లు మాత్రమే వచ్చాయి. కోవింద్ కు 7,02,644 ఓట్లు - మీర్ కుమార్ కు 3,67,314 ఓట్లు పడ్డాయి. దీంతో 3,35,330 ఓట్ల భారీ మెజార్టీతో ఆయన గెలుపు సాధించారు.

కొత్త రాష్ర్టపతి కోవింద్‌కు ప్రధాని నరేంద్రమోదీ - కేంద్రమంత్రులు - కాంగ్రెస్‌ నేతలు - ఏపీ - తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు - కేసీఆర్ లు... బెంగాల్ సీఎం మమతాబెనర్జీ శుభాకాంక్షలు తెలిపారు. కాగా మీరా కుమార్‌ కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి ఒక్క ఓటు కూడా ప‌డ‌లేదు.

ఎక్కడ ఎవరికెన్ని..

* అరుణాచల్‌ ప్రదేశ్‌ : రామ్‌ నాథ్‌ కోవింద్‌ – 448 - మీరాకుమార్‌ -24
* ఆంధ్రప్రదేశ్‌ : రామ్‌ నాథ్‌ కోవింద్‌ – 27,189 - మీరాకుమార్‌ -0
* అసోం : రామ్‌ నాథ్‌ కోవింద్‌ – 10,556 - మీరాకుమార్‌ – 4,060
* బిహార్‌ : రామ్‌ నాథ్‌ కోవింద్‌ – 22,940 - మీరాకుమార్‌ – 18,867
* గోవా : రామ్‌ నాథ్‌ కోవింద్‌ – 500 - మీరాకుమార్‌ -220
* హిమాచల్‌ ప్రదేశ్‌ : రామ్‌ నాథ్‌ కోవింద్‌ – 1,530 - మీరాకుమార్‌ – 1,087
* జమ్మూ -కాశ్మీర్‌ : రామ్‌ నాథ్‌ కోవింద్‌ – 4,032 - మీరాకుమార్‌ -20,160 ఓట్లు వచ్చాయి.