Begin typing your search above and press return to search.

రామోజీ రావు-రజినీకాంత్ పక్కపక్కనే..

By:  Tupaki Desk   |   12 April 2016 7:45 AM GMT
రామోజీ రావు-రజినీకాంత్ పక్కపక్కనే..
X
మీడియాతో పాటు అనేక రంగాల్లో అద్భుత విజయాలు సాధించిన చెరుకూరి రామోజీ రావు.. దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మవిభూషణ్’ను అందుకున్నారు. మంగళవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రామోజీరావు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని అందుకున్నారు.

మన దర్శక ధీరుడు రాజమౌళి సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు. దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ కు ప్రణబ్ పద్మవిభూషణ్ అందుకున్నారు. రామోజీరావు తన స్టయిల్లో వైట్ అండ్ వైట్ లో ఈ కార్యక్రమంలో పాల్గొనగా.. రజినీకాంత్ పొటీషియన్ తరహాలో కనిపించారు. సానియా మీర్జా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకుంది. సాహితీ వేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ కూడా పద్మభూషణ్ అందుకున్నారు.

ఈ కార్యక్రమం ఆసాంతం రామోజీరావు.. రజినీకాంత్ పక్కపక్కనే కనిపించడం విశేషం. కుర్చీల్లో ఆశీనులైనపుడు కూడా వాళ్లిద్దరూ పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకుంటూ కనిపించారు. వీళ్లిద్దరితో పాటు వాసుదేవ్‌ కల్‌ కుంటే ఆత్రే - గిరిజాదేవి - శాంతా విశ్వనాథన్‌ కూడా పద్మవిభూషణ్‌ పురస్కారాలు అందుకున్నారు.

రవీంద్ర చంద్ర భార్గవ-ఇందూజైన్‌-ఉదిత్‌ నారాయణ్‌-హెచ్‌.కన్హయ్యాలాల్‌-స్వామి తేజోమయానంద- రామ్‌ వి.సుతర్‌-ఎన్‌.ఎస్‌. రామానుజ తాతాచార్య పద్మభూషణ్ అందుకోగా.. ప్రియాంక చోప్రా-డా.మన్నం గోపీచంద్‌-సునీతా కృష్ణన్‌-ఎం.ఎం. వెంకటేశ్‌ -మమతా చంద్రాకర్‌ -జైప్రకాశ్‌ లేఖివాల్‌-బాలచంద్ర దత్తాత్రే మోందే-రవీంద్ర నాజర్‌దాహ్యాభాయి శాస్త్రి-సోనూ ఘోష్‌-కామేశ్వరం బ్రహ్మ- జవహర్‌లాల్‌ కౌల్‌-చంద్రశేఖర్‌ శేషాద్రి-డా. అనిల్‌ కుమారి మల్హోత్రా-సుధీర్‌ వి. షా-సైమన్‌ ఓరాన్‌-రవీందర్‌కుమార్‌ సిన్హా-హెచ్‌.ఆర్‌. నాగేంద్ర- ఉజ్వల్‌ నికమ్‌ పద్మశ్రీ పురస్కారాలు తీసుకున్నారు.

రెండు వారాల కిందటే తొలి దశలో కొంతమందికి పద్మ పురస్కారాలు అందించిన సంగతి తెలిసిందే. మంగళవారంతో అవార్డుల అందజేత పూర్తయింది. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ.. ప్రధాని నరేంద్రమోదీ.. కేంద్ర మంత్రులు రాజ్‌ నాథ్‌సింగ్‌- వెంకయ్యనాయుడు- భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తదితరులు హాజరయ్యారు.