Begin typing your search above and press return to search.

రెండు రాష్ట్రాలకు మీడియా మొఘల్ భారీ విరాళం.. ట్విస్ట్ ఏమిటంటే?

By:  Tupaki Desk   |   1 April 2020 4:40 AM GMT
రెండు రాష్ట్రాలకు మీడియా మొఘల్ భారీ విరాళం.. ట్విస్ట్ ఏమిటంటే?
X
విపత్తు వేళ.. విరాళాలు ఇవ్వటం మామూలే. ప్రముఖులు ఎవరికి వారుగా అందించే ఈ విరాళాల తీరు ఒకేలా ఉంటుంది. తాము ఇవ్వాలనుకుంటున్న మొత్తాన్ని మీడియాకు ప్రకటించటం.. లేదంటే చెక్కు తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి చేతికి ఇచ్చి.. ఒక ఫోటో తీయించుకొని.. నాలుగు మాటలు మాట్లాడి రావటం చూస్తుంటాం. అందుకు భిన్నంగా వ్యవహరించటమే కాదు.. విపత్తుల వేళ విభిన్నంగా విరాళాల్ని ప్రకటించటమే కాదు.. ప్రభుత్వానికి అందేలా చేసిన తీరు మీడియా మొఘల్ రామోజీకే సొంతమేమో?

కరోనా కష్టకాలంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.10 కోట్లు చొప్పున మొత్తం రూ.20 కోట్ల భారీ మొత్తాన్ని ప్రకటించారు సీహెచ్. రామోజీరావు. రామోజీ గ్రూపు సంస్థల్లోని మీడియా సంస్థల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కరోనా లాంటి విపత్తు విరుచుకుపడినవేళ.. తెలుగు రాష్ట్రాలకు తన వంతు సాయంగా ఈ భారీ మొత్తాన్ని ప్రకటించారు. సాధారణంగా ఇలాంటి విరాళాలు ఇస్తున్నప్పుడు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిసి వారి చేతికి ఇవ్వటం మామూలే.

దీనికి భిన్నంగా.. తాను చెల్లిస్తానని చెప్పిన మొత్తాన్నిఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆన్ లైన్ పద్దతిలో ఈ విరాళాన్ని ట్రాన్స్ ఫర్ చేయటం ద్వారా కొత్త కల్చర్ కు శ్రీకారం చుట్టారని చెప్పాలి. ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ వేళ.. ఎంతో అవసరమైతే తప్పించి బయటకు రాకూడదన్న ఆంక్షలు నెలకొన్న వేళ.. ఆ రూల్స్ ను బ్రేక్ చేయకుండా ఉంటూ.. విరాళాన్ని ప్రభుత్వ ఆకౌంట్లలో జమ చేయటం చూస్తే.. రామోజీ తీరు నలుగురికి భిన్నంగా ఉంటుందన్న విషయాన్ని తాజాగా మరోసారి ఫ్రూవ్ చేశారని చెప్పాలి. చిన్న మొత్తాలకు సైతం ముఖ్యమంత్రుల్ని కలిసి.. వారి చేతికి చెక్కు.. హగ్గు ఇచ్చేస్తున్న వేళ.. అందుకు భిన్నంగా ఆన్ లైన్ లో ట్రాన్సఫర్ చేసిన తీరు కొత్త తరహాలో ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రామోజీనా మజాకానా?