Begin typing your search above and press return to search.
‘రామోజీ మల్టీ మీడియా’ అంటే ఏమిటి..?
By: Tupaki Desk | 9 Dec 2015 4:09 AM GMTమీడియా మొఘల్ గా పేరున్న ‘ఈనాడు’ రామోజీరావు ఏం చేసినా సంచలనమే. ఆయన కాలు కదిపితే అదో వార్తాంశం. ఒక పట్టాన బయటకు రాని ఈ పెద్ద మనిషి.. బయటకు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. తెర మీద కంటే తెర వెనుక నుంచే కథను నడిపించే సత్తా ఉన్న రామోజీ రావు రేంజ్ ఏమిటో తెలుగు ప్రజలకు సుపరిచితం.
తాజాగా ఆయన జరుపుతున్న ఢిల్లీ పర్యటన ఆసక్తిని రేకెత్తిస్తోంది. సోమవారం ప్రధాని మోడీతో భేటీ అయిన సందర్భంలోనూ.. మంగళవారం పలువురు కేంద్రమంత్రుల్ని కలిసిన సందర్భంగా ఒక కొత్త మాట పదే పదే వినిపిస్తోంది. రామోజీ ఢిల్లీ పర్యటనకు సంబంధించిన వార్తల్ని విశేష ప్రాధాన్యత కల్పిస్తూ వేసిన వార్తల్ని శ్రద్ధగా చదివితే ఒక్క పదం దగ్గర కళ్లు ఆగిపోయే పరిస్థితి.
స్వచ్ఛభారత్ కోసం తమ సంస్థ చేసిన ప్రయత్నాల్ని ఫోటోలతో పెద్ద ఆల్బం తయారు చేయించిన పలువురికి చూపిస్తున్న రామోజీ.. అదే సమయంలో తమ ఓం సిటీ ప్రాజెక్టు గురించి ప్రస్తావిస్తున్నారు. ఈ రెండు కాకుండా.. ‘‘రామోజీ మల్టీ మీడియా’’ అంటూ మరో మాటను తరచూ వాడుతున్నారు. ఇంతకీ ఈ రామోజీ మల్టీ మీడియాలో ఏం ఉండనుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరం.
పాతికేళ్ల భవిష్యత్తును వర్తమానం నుంచే అంచనా కట్టే సత్తా ఉన్న రామోజీరావు.. తన పేరిటే ఉన్న మల్టీ మీడియా గురించి పదే పదే ప్రస్తావించటం.. దాన్ని ప్రధాని మొదలు.. కేంద్రమంత్రుల వరకూ అందరి వద్దా ప్రస్తావించటం చూస్తే.. భారీ వ్యాపారం ఏదో రామోజీ స్టార్ట్ చేస్తారన్న భావన కలగటం ఖాయం. ఈ మధ్యనే.. బయటకు వచ్చిన వార్తల ప్రకారం.. మరికొద్ది రోజుల్లో డజన్ల కొద్దీ ఛానళ్లను స్టార్ట్ చేయాలన్న పనిలో బిజీగా ఉన్నారన్న వార్తలు వచ్చాయి.
ఇందుకు బలం చేకూరుస్తూ తాజాగా రామోజీ మల్టీ మీడియా అన్న కాన్సెప్ట్ ను పదే పదే ప్రస్తావించటం.. దానికి సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవటం గమనార్హాం. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రామోజీ మల్టీ మీడియా ప్రాజెక్టులు.. తాము స్టార్ట్ చేయాలని భావిస్తున్న డజన్ల కొద్దీ ఛానళ్లతో పాటు.. భారీ ఎత్తున వెబ్ సైట్లు.. యాప్ లతో పాటు.. డిజిటల్ మ్యాగ్ జైన్లు.. సంప్రదాయ మ్యాగ్ జైన్లు కూడా ఉన్నాయని చెబుతున్నారు. అటు సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే.. ఇటు డిజిటల్ మార్కెట్ లోనూ భారీ ఎత్తున తన ‘మీడియా’ను విస్తరించటమే రామోజీ మల్టీ మీడియా కాన్సెప్ట్ గా చెబుతున్నారు.
అయితే.. ఇదంతా అంచనానే. అధికారికంగా రామోజీ ఏం చేయనున్నారన్నది ఆ సంస్థ వెల్లడించినప్పుడు స్పష్టం అవుతుందని చెప్పక తప్పదు. ఇక.. రామోజీ మల్టీ మీడియాకు సంబంధించి మరో ఆసక్తికర అంశాన్ని చెబుతున్నారు. రామోజీ స్టైల్ ప్రకారం.. ఒక అంశాన్ని ఆయన బయట పెట్టారంటే.. దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ మొత్తం పూర్తి అయి.. ప్రాజెక్టు ఒక దశకు చేరి ఉంటుందన్న మాట వినిపిస్తోంది. వీటికి సంబంధించిన అధికారిక అనుమతుల కోసమే తాజాగా ఆయన ఢిల్లీ పర్యటన జరుపుతున్నట్లుగా చెబుతున్నారు. రామోజీ అంతటి వ్యక్తి అనుమతుల కోసం ఢిల్లీలో అడుగు పెడితే.. కాని పని ఏమైనా ఉంటుందా..?