Begin typing your search above and press return to search.
రామోజీకి ప్రపంచ తెలంగాణ సదస్సు ఇన్విటేషన్
By: Tupaki Desk | 29 April 2016 5:51 AM GMTఇది కాస్త చిత్రమైన అంశంగా చెప్పాలి. ప్రపంచ తెలంగాణ సదస్సుకు అసలుసిసలు ఆంధ్రోడికి ఆహ్వానం అందించింది. అది కూడా.. సదరు ఆంధ్రోడి ఇంటికి వచ్చి మరీ ఇన్విటేషన్ కార్డు ఇచ్చివెళ్లటం గమనార్హం. అమెరికాలోని డల్లాస్ నగరంలో జూన్ 3 నుంచి 5 వరకు నిర్వహించే ప్రపంచ తెలంగాణ సదస్సుకు మీడియా మొఘల్ గా పేరున్న రామోజీ గ్రూప్ అధినేత రామోజీరావును సదస్సు ప్రముఖులు ఆహ్వానించారు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ ప్రాంతానికి చెందని వ్యక్తులకు తెలంగాణ పేరిట జరిగే కార్యక్రమాలకు ఆహ్వానం పలికింది లేదు. తెలంగాణేతరులకు తెలంగాణలో ప్రాతినిద్యం ఇవ్వటమన్నది దాదాపుగా లేని అంశంగా చెప్పాలి. నిజానికి అలాంటిది జరుగుతున్న ఆలోచన కూడా ఎవరూ చేయలేని పరిస్థితి. ఇందుకు భిన్నంగా ప్రపంచ తెలంగాణ సదస్సుకు ఏపీలోని కృష్ణా జిల్లాలో జన్మించిన రామోజీరావును ఆహ్వానించటం ఒక ప్రత్యేక అంశంగా భావించాలి.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఎన్నారైలను ఏకం చేయాలన్న ఉద్దేశంతో 1999 న్యూయార్క్ వేదికగా పురుడు పోసుకున్న ఈ వేదిక నిర్వహించే ప్రపంచ సదస్సుకు తెలంగాణ ప్రాంతంలో జన్మించని ఏపీప్రాంతానికి చెందిన వ్యక్తికి ఆహ్వానం అందటం విశేషంగా చెప్పాలి. ఈ కార్యక్రమానికి వివిధ దేశాల్లో స్థిరపడిన తెలంగాణ వాసులు వేలాదిగా హాజరు అవుతారని చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణప్రాంతానికి చెందిన వివిధ పార్టీ నేతలు.. ఉద్యమకారుల్ని ఆహ్వానిస్తున్నారు. ఆ వరుసలో రామోజీరావు కూడా ఉండటం దేనికి నిదర్శనం..?