Begin typing your search above and press return to search.

బీజేపీతోనే రామోజీ!..టార్గెట్ మాత్రం కొత్త‌దే!

By:  Tupaki Desk   |   13 Jun 2019 1:30 PM GMT
బీజేపీతోనే రామోజీ!..టార్గెట్ మాత్రం కొత్త‌దే!
X
ఈనాడు గ్రూపు సంస్థ‌ల అధినేత చెరుకూరి రామోజీ రావుకు ఇప్పుడు చాలా ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులే ఎదుర‌వుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో రామోజీ దోస్తానా ఈనాటిది కాదు. తెలుగు నేల‌లో తెలుగుదేశం పార్టీ ప్ర‌యోజ‌నాలే ప్ర‌ధానంగా సాగిన రామోజీ... ఏ ఒక్క సంద‌ర్భంలో కూడా బీజేపీతో దోస్తానాను తెంచుకోలేదు. టీడీపీ, బీజేపీ మిత్రులుగా ఉన్నా, శ‌త్రువులుగా ఉన్నా కూడా క‌మ‌ల‌నాథుల‌తో రామోజీ ఏనాడూ స్నేహాన్ని ప‌క్క‌న‌పెట్ట‌నే లేదు. అయితే ఇటీవలి కాలంలో టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు వ్య‌వ‌హ‌రించిన తీరుతో రామోజీని బీజేపీ కీల‌క నేత‌లుగా ఉన్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాలు కాస్తంత దూరం పెట్టేశారు. 2014లో పీఎంగా ప్ర‌మాణం చేసే కార్య‌క్ర‌మానికి రామోజీని ఆహ్వానించిన మోదీ... ఏకంగా ముందు వ‌రుస‌లో కుర్చీ వేశారు. అయితే తాజా ప్ర‌మాణ స్వీకారానికి క‌నీసం రామోజీకి ఆహ్వానం కూడా పంప‌లేదు. ఈ లెక్క‌న టీడీపీ కార‌ణంగానే రామెజీని మోదీ - షాలు దూరం పెట్టేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

అయితే ఇప్ప‌టికే తెలంగాణ‌లో తుడిచిపెట్టుకుపోయిన టీడీపీ... ఏపీలోనూ బ‌క్క‌చిక్కిపోయింది. ఈ నేప‌థ్యంలో బీజేపీతోనే క‌లిసి న‌డిచేందుకు రామోజీ తీర్మానించుకున్న‌ట్లుగా విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. తెలంగాణ‌లో టీఆర్ ఎస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కొంత‌కాలం పాటు ఆ పార్టీ ప్ర‌భుత్వానికి అనుకూలంగానే వ్య‌వ‌హ‌రించిన ఈనాడు... తాజాగా కేసీఆర్ స‌ర్కారుకు వ్య‌తిరేకంగా క‌థ‌నాలు రాయడం మొద‌లెట్టేసింది. అంటే... బీజేపీతో త‌న స్నేహాన్ని పున‌రుద్ధ‌రించుకునేందుకే రామోజీ సిద్ధ‌ప‌డ్డార‌న్న వాద‌న వినిపిస్తోంది. నిన్న త‌న ప‌త్రిక‌లో జ‌నం మిస్స‌వుతున్న వైనంపై ప్ర‌త్యేక క‌థ‌నం రాసిన ఈనాడు... టీఆర్ ఎస్ స‌ర్కారుపై ప్ర‌త్య‌క్ష యుద్ధాన్నే ప్ర‌క‌టించింద‌నే చెప్పాలి. ఈనాడు క‌థ‌నంపై టీఆర్ ఎస్ స‌ర్కారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసినా కూడా రామోజీ వెన‌క్కు త‌గ్గేందుకు సిద్ధంగా లేర‌నే వాద‌న కూడా వినిపిస్తోంది.

తాజా ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో బీజేపీ నాలుగు సీట్ల‌ను కైవ‌సం చేసుకున్న తీరు చూస్తుంటే... 2024 ల‌క్ష్యంగా రామోజీ కొత్త వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్న‌ట్లుగా తెలుస్తోంది. టీడీపీకి బ‌ద్ధ శ‌త్రువుగా ఉన్న కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుని సాగిన రామోజీ... ఇప్పుడు కాంగ్రెస్ స్థానంలో టీఆర్ ఎస్ ను టార్గెట్ చేసుకుని ముందుకు సాగాల‌ని భావిస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై త‌న‌దైన శైలి పోరును చేప‌ట్ట‌డం ద్వారా.. టీఆర్ ఎస్ ను గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్యంగా రామోజీ కొత్త వ్యూహాలు ప‌న్నుతున్నారు. అంతేకాకుండా ఇదే వ్యూహంతో టీడీపీ కార‌ణంగా బీజేపీతో పెరిగి గ్యాప్ ను కూడా క‌వ‌ర్ చేసుకునేందుకు కూడా రామోజీ ప్ర‌త్యేక వ్యూహం అమ‌లు చేస్తున్న‌ట్లుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. మ‌రి రామోజీ వ్యూహం ఏ మేర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో చూడాలి.