Begin typing your search above and press return to search.
రామోజీ ఇంటికి పెళ్లి కళ
By: Tupaki Desk | 9 April 2017 5:56 AM GMTమీడియా లెజెండ్ రామోజీ రావు ఇంట్లో చాలాకాలం తరువాత శుభకార్యం జరగబోతోంది. పెద్ద కుమారుడు, ఈనాడు ఎండీ కిరణ్ కుమార్తెకు జూన్ 28న వివాహం చేయనుండడంతో ఆ ఇంటికి పెళ్లి కళ వచ్చింది. రామోజీ ఫిలిం సిటీలో కొండపై రెండు దశాబ్దాల కిందట నిర్మించుకుంటున్న ఇంట్లో రామోజీ రావు చాలాకాలంగా ఉండడం లేదు. ఆ భారీ భవంతి ఖాళీగానే ఉంది. ప్రస్తుతం పెళ్లి నేపథ్యంలో అది మళ్లీ కళకళలాడుతోంది.
కిరణ్ పెద్ద కుమార్తె చెరుకూరి సహరికి భారత్ బయోటెక్ సంస్థకు చెందిన యెల్లా రాచెస్ వీరేంద్రదేవ్ తో పెళ్లి కుదిరింది. ఏప్రిల్ 7న వీరిద్దరి నిశ్చితార్థం కూడా రామోజీ ఫిలింసిటీలోనే వేడుకగా జరిగింది. హైదరాబాద్ జినోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ సంస్థ సీఎండీ డా.కృష్ణ యెల్లా, సుచిత్ర యెల్లాల కుమారుడే రాచెస్. జికా వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టిన మొట్టమొదటి సంస్థగా భారత్ బయోటెక్ కు పేరుంది. మరోవైపు సుచిత్ర యెల్లా... వధువు తల్లి, మార్గదర్శ ఎండీ శైలజా కిరణ్ లు మంచి స్నేహితులు. కాగా... సుచిత్ర యెల్లాకు 2015లో టీటీడీ బోర్డు మెంబర్ గానూ పదవి దక్కింది. అందులో ఈనాడు కుటుంబం సహకారం ఉందని చెబుతుంటారు. ఇప్పుడు ఈ స్నేహితురాళ్లిద్దరూ వియ్యపురాళ్లుగా మారుతున్నారు.
ఈ కార్యక్రమానికి రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులను ఆహ్వానించినప్పటికీ వారు హాజరుకాలేదు.. అయితే, వారి కుమారులు మాత్రం నిశ్చితార్థానికి వచ్చి చాలాసేపు గడిపనట్లు సమాచారం. మంచు లక్ష్మి తదితరులూ వచ్చినట్లు తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/