Begin typing your search above and press return to search.
రూమర్స్ కు చెక్ చెప్పేసిన రామోజీ..
By: Tupaki Desk | 28 Aug 2019 6:35 AM GMTమీడియా మొఘల్.. ఈనాడు అధినేత చెరుకూరి రామోజీరావు ఆరోగ్యం అస్సలు బాగోలేదంటూ ఇటీవల కాలంలో ఒక పనికిమాలిన మెసేజ్ అటు వాట్సాప్ గ్రూపుల్లోనూ.. ఇటు సోషల్ మీడియాలోనూ హడావుడి చేస్తోంది. అదిగో తోక అంటే ఇదిగో పులి అన్న చందంగా.. ఈ మెసేజ్ ను పట్టుకొని రామోజీ ఆరోగ్యం అస్సలు బాగోలేదని.. ఆయన వైద్యసేవల కోసం రామోజీ ఫిలింసిటీలో ప్రత్యేకంగా ఒక రూమ్ ను ఏర్పాటు చేశారంటూ ఇష్టం వచ్చిన రాతలు రాసేశారు.
ఇదిలా ఉంటే.. ఆ సమాచారం తప్పని.. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని.. ఇంకా చెప్పాలంటే తన రోజువారీ వ్యాపార పనుల్ని సైతం సమర్థంగా నిర్వహిస్తున్న వైనాన్ని తుపాకీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని తాజాగా ఈనాడు తనదైన శైలిలో చెప్పేసిందని చెప్పాలి.
రామోజీ ఫిలింసిటీలో ఒక పుస్తకావిష్కరణ జరిగింది. ఈనాడు గ్రూపులోని అన్నదాత మ్యాగ్ జైన్ కు కార్యనిర్వాహక సంపాదకుడిగా వ్యవహరిస్తున్న అమిర్నేని హరికృష్ణ రాసిన ఎడారిలో ఒయాసిస్సు - ఇజ్రాయెల్ వ్యవసాయం అన్న పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆ పుస్తకాన్ని ఆవిష్కరించింది ఎవరో కాదు.. గడిచిన కొద్ది రోజుల్లో తీవ్ర అనారోగ్యంగా ఉన్నారంటూ దరిద్రపుగొట్టు ప్రచారం జరుగుతున్న ఈనాడు సంస్థల అధినేత రామోజీరావే. సాధారణంగా పుస్తకావిష్కరణ కార్యక్రమం లాంటివి చేస్తే.. రామోజీనే చేస్తారు.
అందుకు భిన్నంగా ఈసారి మాత్రం తన కుమారుడు కమ్ ఈనాడు ఎండీ కిరణ్ తో పాటు.. ఈనాడుకు ఎడిటోరియల్ కు మూలస్తంభాల్లాంటి డీఎన్ ప్రసాద్.. ఎం. నాగేశ్వరరావుతో పాటు.. సర్క్యులేషన్ కు జీఎం అయిన సుధాకర్ లతో కలిసి ఫోటో దిగారు. దీని ద్వారా.. ఈనాడు దినపత్రికకు సంబంధించి అత్యంత కీలకమైన ఆ నలుగురితో పాటు.. పుస్తకం రాసిన పెద్ద మనిషితో కలిసి రామోజీ ఫోటో దిగటం.. ఆ వార్తను ప్రముఖంగా ప్రచురించటం ద్వారా.. రామోజీ ఆరోగ్యం ఎలా ఉందన్న విషయాన్ని ప్రపంచానికి తనదైన శైలిలో చెప్పేసింది.