Begin typing your search above and press return to search.
రామోజీనే సచివాలయానికి వెళ్లాల్సి వచ్చిందే..!
By: Tupaki Desk | 13 April 2015 7:50 PM GMTఆయన ప్రత్యర్థులు ఆయన్ను రాజగురువుగా వ్యాఖ్యానిస్తుంటారు. ఈనాడు సంపాదకులుగా వ్యవహరిస్తూ.. రామోజీ ఫిలిం సిటీకి.. ఓ పెద్ద వ్యాపార గ్రూప్‌కు అధినేత అయిన రామోజీరావు తెలంగాణ సచివాలయానికి వెళ్లారు.
ఎందరో ప్రముఖులు.. వీవీఐపీలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవటంలో విశేషం ఏమీ లేనప్పుడు.. రామోజీరావు సచివాలయం రావటంలో విశేషం ఏమందని అనుకోవచ్చు. కానీ.. ఇక్కడే పెద్ద విశేషం ఉంది. రామోజీరావు లాంటి వ్యక్తి దగ్గరకు ముఖ్యమంత్రులే వెళతారు కానీ.. ఆయన ఏ ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చింది లేదు. అలాంటి ఆయన.. తనకు తానే సచివాలయం మెట్లు తొక్కటం వార్తాంశంగా మారింది.
ఉమ్మడిరాష్ట్రంలో ఎన్టీఆర్ కావొచ్చు.. చంద్రబాబు కావొచ్చు.. కొందరు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కావొచ్చు. ఆయన్ను కలవటమో.. ఆయన ప్రతినిధులతో మాట్లాడటమో చేస్తారు. తనకు ఏ అవసరం వచ్చినా ఆయనకు ఆయనగా బయటకు అడుగుపెట్టటం అన్నది ఉండదు. అలాంటి ఆయన.. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లటం చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. రామోజీ ఫిలింసిటీకి వెళ్లి దాదాపు ఐదున్నర గంటల పాటు గడపటం.. ఆ తర్వాత ఫిలింసిటీని కేసీఆర్ మా గొప్పగా పొగిడేయటం తెలిసిందే.
తాజాగా.. రామోజీ ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చిన సందర్భంగా అక్కడున్న విలేకరులు ఆయన్ను చుట్టుముట్టారు. యథావిధిగా ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు. వాటికి సింఫుల్‌గా సమాధానం ఇస్తూ.. ఏం లేదు ఊరికే కలిశా అంటూ తేల్చేశారే కానీ.. అసలు విషయాన్ని మాత్రం చెప్పలేదు.
తర్వాత.. ఓంసిటీ సంబంధించిన పుస్తకాన్ని సీఎంకు బహుకరించారని చెబుతున్నారు. మరోవైపు.. ఓం సిటీకి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం కోసం కేసీఆర్‌ను ఆహ్వానించటం కోసం వచ్చారని చెబుతున్నారు. మొత్తానికి రామోజీని ముఖ్యమంత్రి కార్యాలయానికి రప్పించిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్న వ్యాఖ్యలు చేస్తున్నారు.