Begin typing your search above and press return to search.

రామోజీకి పద్మభూషణ్ లేనట్లేనా...?

By:  Tupaki Desk   |   10 Jan 2016 10:48 AM GMT
రామోజీకి పద్మభూషణ్ లేనట్లేనా...?
X
మీడియా కింగ్ రామోజీ రావుకు పద్మ భూషణ్ పురస్కారం వస్తుందని కొద్దికాలంగా ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లుగానే ఆయన తరచూ ఢిల్లీలోని పెద్దలను కలుస్తున్నారు. పైగా సూటుబూటు వేసుకుని హడావుడి చేస్తున్నారు. అయితే... ఇంత చేసినా ఆయన ప్రయత్నాలు ఫలించలేదని వినికిడి. ఈ ఏడాది పద్మ అవార్డులు ఎవరెవరికి వస్తున్నాయన్నది జాతీయ మీడియాలో ఆదివారం ఊహాగానాలు వచ్చాయి. దాని ప్రకారం ఆ జాబితాలో రామోజీకి చోటు లేదు.

ఆంధ్రప్రదేశ్ నుంచి భరత నాట్య కళాకారిణి యామిని కృష్ణమూర్తికి పద్మ విభూషణ్ రానున్నట్లు సమాచారం. 2001లో వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఆమెకు పద్మభూషణ్ ఇచ్చారు. ఈసారి ఏపీ నుంచి యార్గగడ్డ లక్ష్మీప్రసాద్ కు పద్మభూషణ్ ఖరారైందని తెలుస్తోంది. వీరితో పాటు అనుపమ్ ఖేర్ కు పద్మభూషణ్ రానుందని సమాచారం. ఇంకా భరత నాట్యం కళాకారిణి ప్రతిభా ప్రహ్లాద్ - గాయకుడు కైలాశ్ ఖేర్ - క్లారినెట్ విద్వాంసుడు నటరాజన్ - బీజేపీ పబ్లిసిటీ విభాగం లీడర్ పీయూష్ పాండే - 2జీ స్కాంను బయటపెట్టి యూపీఏ ప్రభుత్వ పతనానికి కారణమైన కాగ్ మాజీ ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్ - క్రికెటర్ జహీర్ ఖాన్ - హాకీ క్రీడాకారుడు - ధ్యాన్ చంద్ కుమారుడు - 1975 హాకీ వరల్డ్ కప్ గెలిపించిన అశోక్ కుమార్ - డాక్టర్ యార్లగడ్డ నాయుడమ్మ తదితరులకు పద్మ అవార్డులు రానున్నాయట. ఈ జాబితాలో ఎక్కడా రామోజీరావు పేరు కనిపించడం లేదు. దీంతో రామోజీ ఆశలు అడియాసలేనంటున్నారు. అయితే... చివరి నిమిషంలో ఆయన లాబీయింగ్ చేస్తారన్న వాదనా ఉంది.