Begin typing your search above and press return to search.
రామోజీ ఇంట పెళ్లిని లైవ్ ఇచ్చేశారు
By: Tupaki Desk | 28 July 2017 5:38 PM GMTమీడియా మొఘల్.. ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు మారిపోయారా? తన తీరును మార్చుకున్నారా? అన్న సందేహం కలిగేలా తాజా పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. తన ఇంటికి సంబంధించిన వేడుకల విషయంలో చాలా చాలా లో ప్రొఫైల్ మొయింటైన్ చేసే రామోజీ..ఈసారి అందుకు భిన్నంగా తన మనమరాలి పెళ్లి వేడుకను లైవ్ టెలికాస్ట్ చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
తనకు సంబంధించిన వార్తల్ని.. తన కుటుంబ సభ్యులకు సంబంధించిన విశేషాలు.. తన ఇంట జరిగే వేడుకల్ని చాలా లోప్రొఫైల్ మొయింటైన్ చేయటం కనిపిస్తుంది. ఏదైనా వేడుక జరిగినా.. ఒకట్రెండు ఫోటోలు తప్పించి బయటకు రావు. అలాంటిది తన మనమరాలు సహరి వేడుకల సందర్భంగా మాత్రం తన తీరును రామోజీ పూర్తిగా మార్చేసుకున్నారని చెప్పాలి.
ఈటీవీ ఛానళ్లలో ఈ పెళ్లి వేడుకను లైవ్ టెలికాస్ట్ ఇవ్వటం విశేషం. అంతేనా.. ఈనాడుకు చెందిన డిజిటల్ ఫ్లాట్ ఫాంలలో ఈ వేడుకకు లభించిన ప్రాధాన్యం అంతాఇంతా కాదని చెప్పాలి. అంతేనా.. ఫోటోలను సైతం బయట మీడియా సంస్థలకు పంపేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లను ఈనాడు యాజమాన్యం చేసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మరో ఆసక్తికర కోణం ఏమిటంటే.. రామోజీ మనమరాలి వివాహ వేడుకకు సంబంధించిన వివరాలు చాలా పరిమితంగానే బయటకు వచ్చాయి. కానీ.. పెళ్లి వేడుక రోజుకు మాత్రం పూర్తిస్థాయిలో రామోజీ మీడియా మొత్తం రంగంలోకి దిగటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని సామాన్య ప్రజలకు అనూహ్యమైన వేడుక వివరాలు కళ్లకు కట్టినట్లుగా లైవ్ లో టెలికాస్ట్ కావటం అందరిలోనూ పెద్ద ఎత్తున ఆసక్తి వ్యక్తమైంది.