Begin typing your search above and press return to search.

ఇకపై.. రామోజీ ‘‘ఎఫ్ ఎం’’

By:  Tupaki Desk   |   28 Feb 2017 4:46 AM GMT
ఇకపై.. రామోజీ ‘‘ఎఫ్ ఎం’’
X
మీడియా మొఘల్ గా సుపరిచితులైన రామోజీరావు మరో బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నారు. సుదీర్ఘకాలంగా మీడియా వ్యాపారంలో ఉన్న ఆయన కాలానికి తగ్గట్లుగా ప్రదాన మీడియాలన్నింటిలోకి అడుగుపెట్టారు. అయితే.. ఎఫ్ఎం విషయంలో మాత్రం ఆయన చాలానే ఆలస్యం చేశారన్న విమర్శ ఉంది. రేడియో నుంచి ఎఫ్ ఎం రేడియో దశలో.. వాటిపట్ల రామోజీ ఆసక్తిని ప్రదర్శించలేదని చెబుతారు. ఈ కారణంతోనే.. ఎఫ్ ఎం రేడియో ఎంట్రీలో ఆయన కనిపించలేదు. రేడియో విషయంలో ఆయన అంచనాల్ని వమ్ము చేస్తూ.. ఫలితాలు వెలువడటం.. ప్రధాన మీడియా స్రవంతిలో ఒకటిగా మారుతున్న వేళ.. ఎఫ్ ఎంలో అడుగు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు.

గడిచిన కొద్ది నెలలుగా రామోజీ ఫిలింసిటీలో ప్రత్యేకంగా ఎఫ్ ఎం రేడియో స్టేషన్లకు అవసరమైన కార్యాలయాల్నిసిద్ధం చేసుకుంటున్నట్లుగా సమాచారం. దీనికి తగ్గట్లే తాజాగా వెలువడిన నిర్ణయం చూస్తే.. ఎఫ్ ఎం రేడియోల్లోకి రామోజీ ఎంటర్ అయినట్లేనని చెప్పాలి. దేశ వ్యాప్తంగా ఎఫ్ ఎం రేడియోస్టేషన్ల కోసం నిర్వహించిన వేలంలో 66 ఛానళ్లు అమ్ముడుపోగా.. వాటిల్లో రామోజీకి చెందిన ఈనాడు గ్రూప్ సంస్థలు వరంగల్ లో రెండు.. తిరుపతి.. విజయవాడలలో ఒక్కొక్కటి చొప్పున ఛానళ్లను సొంతం చేసుకున్నాయి.

దేశ వ్యాప్తంగా నిర్వహించిన మూడోదశ వేలంలో రెండో బ్యాచ్ ఫలితాల్ని కేంద్ర సమాచార శాఖ వెల్లడించింది. 92 నగరాలు.. పట్టణాల కోసం మొత్తం 266 ఎఫ్ఎం స్టేషన్లను వేలం పెట్టగా.. 66 ఛానళ్లు అమ్ముడయ్యాయి. అదే సమయంలో 200 ఎఫ్ ఎం స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు ఎవరూముందుకు రాకపోవటం గమనార్హం. ఇక.. తాజాగా అమ్ముడైన ఎఫ్ ఎం స్టేషన్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ.200 కోట్ల ఆదాయం రానుంది.

తాజాగా అమ్ముడైన ఛానళ్లలో అత్యధిక ధరకు హైదరాబాద్ లో ఏర్పాటు చేసే ఎఫ్ఎం అమ్ముడైంది. ఈ రేడియో చానల్ ను అత్యధికంగా రూ.23.4కోట్లకు కళానిధి మారన్ నేతృత్వంలోని సన్ గ్రూప్ కు చెందిన కల్ రేడియో సొంతం చేసుకోగా.. తర్వాతి స్థానంలో రూ.15.61 కోట్లకు డెహ్రాడూన్ ఎఫ్ ఎం రేడియో స్టేషన్ సొంతం చేసుకుంది. ఇది కూడా సన్ గ్రూప్ కు సంస్థే కావటం గమనార్హం. సో.. రానున్న రోజుల్లో ఎఫ్ ఎంలలో ‘‘రామోజీ’’ మార్క్ కనిపించనున్నదన్న మాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/