Begin typing your search above and press return to search.
జగన్‌కు షాక్ : టీడీపీ గూటికి మరో ఎమ్మెల్యే
By: Tupaki Desk | 4 Nov 2017 6:01 AM GMTతూర్పుగోదావరి జిల్లా రంపచోడవరానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వంత ల రాజేశ్వరి శనివారం నాడు ఉదయం తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ నాయకుడు వర్ల రామయ్య తదితరులు వెంట రాగా ఆమె ముఖ్యమంత్రి సమక్షంలో తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లుగా , రాజేశ్వరి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. జగన్ పాదయాత్ర ప్రారంభించడానికి కేవలం రెండురోజుల వ్యవధి ఉండగా.. ఇలాంటి షాక్ తగలడం యాదృచ్ఛికం కాకపోవచ్చు అనే అనుమానాలు వినిపిస్తున్నాయి.
అయితే చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరిన తర్వాత.. రాజేశ్వరి చెప్పిన మాటలు గమనించదగినవి. తను ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ లో ఉండడం వల్ల తన నియోజకవర్గ ప్రజలు చాలా నష్టపోతున్నారని, తన నియోజకవర్గంలో కొంచెమైనా అభివృద్ధి జరగలేదని ఆమె చెప్పుకొచ్చారు. నియోజకవర్గంలో అబివృద్ధి పనులు జరగడం కోసమే తాను పార్టీ మారుతున్నట్లుగా ఆమె వివరణ ఇచ్చుకున్నారు.
ఈ వ్యవహారాన్ని గమనిస్తే... అభివృద్ధి పేరిట వైకాపా ఎమ్మెల్యేలను బ్లాక్ మెయిల్ చేస్తూ... వారి నియోజకవర్గాల్లో ఎలాంటి పనులు జరగనివ్వకుండా చేస్తూ ఒక రకమైన బెదిరింపులతో చంద్రబాబునాయుడు వారిని తన పార్టీలో చేర్చుకోవడానికి కుట్రలు చేస్తున్నారా అనే అనుమానాలు ఎవ్వరికైనా కలుగుతాయి. రాజేశ్వరి చెబుతున్న మాటల మర్మం అలాగే ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
చంద్రబాబు వైకాపా ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోవడానికి అనుసరిస్తున్న రకరకాల కుట్ర మార్గాల్లో ఇది కూడా ఒకటనే ప్రచారం ప్రజల్లో బాగా జరుగుతోంది. ప్రధానంగా ప్రలోభాలు - బెదిరింపులు - నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా వారు బెంబేలెత్తిపోయేలా, తమను గెలిపించిన ప్రజలకోసం మెట్టు దిగజారడానికైనా సిద్ధపడేలా ప్రేరేపించడం చంద్రబాబు వ్యూహాలుగా ఉంటున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.